Recent Posts

enda gaani needa gaani

అన్నమయ్య కీర్తన ఎండ గాని నీడ గాని ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మాకులదైవము ॥ తేలుగాని పాముగాని దేవపట్టయినగాని గాలిగాని ధూళిగాని కానియేమైన । కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి- నీలవర్ణుడేమా నిజదైవము ॥ చీమగాని దోమగాని చెలది యేమైనగాని గాముగాని నాముగాని కానియేమైన । పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు ధూమకేతువేమో దొరదైవము ॥ పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని కల్లగని నల్లిగాని కానియేమైన । బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి …

emoko chigurutadharamuna

అన్నమయ్య కీర్తన ఏమొకో చిగురుటధరమున ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను । భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ॥ కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన । చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు । నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు । నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా ॥ పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల । కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు । వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు । వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా ॥ ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల …

emani pogadudume

అన్నమయ్య కీర్తన ఏమని పొగడుదుమే రాగం:ఆభేరి తాళం :ఆదితాళం ఏమని పొగదుడుమే యికనిను । ఆమని సొబగుల అలమేల్మంగ ॥ తెలికన్నుల నీ తేటలే కదవే । వెలయగ విభునికి వెన్నెలలు । పులకల మొలకల పొదులివి గదవే । పలుమరు పువ్వుల పానుపులు ॥ తియ్యపు నీమోవి తేనెలే కదవే । వియ్యపు రమణుని విందులివి । ముయ్యక మూసిన మొలక నవ్వు గదె । నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ॥ కైవసమగు నీ …

ele ele maradalaa

అన్నమయ్య కీర్తన ఏలే ఏలే మరదలా ఏలే యేలే మరదలా చాలుజాలు । చాలును చాలు నీతోడి సరసంబు బావ ॥ గాటపు గుబ్బలు గదలగ గులికేవు । మాటల దేటల మరదలా । చీటికి మాటికి జెనకేవే వట్టి । బూటకాలు మానిపోవే బావ ॥ అందిందె నన్ను నదలించి వేసేవు । మందమేలపు మరదలా । సందుకో దిరిగేవి సటకారివో బావ । పొందుగాదిక బోవే బావ ॥ చొక్కపు గిలిగింతల చూపుల నన్ను …

ee suralu ee munulu

అన్నమయ్య కీర్తన ఈ సురలు ఈ మునులు ఈ సురలీమును లీచరాచరములు । యిసకలమంతయు నిది యెవ్వరు ॥ ఎన్నిక నామము లిటు నీవై యుండగ । యిన్ని నామము లిటు నీవై యుండగ । వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి । యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ॥ వొక్కరూపై నీవు వుండుచుండగ మరి । తక్కిన యీరూపములు తామెవ్వరు । యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ । మక్కువ నుండువారు మరి యెవ్వరు ॥ …

e puraanamula nenta vedikinaa

అన్నమయ్య కీర్తన ఏ పురాణముల నెంత వెదికినా ఏపురాణముల నెంత వెదికినా । శ్రీపతిదాసులు చెడ రెన్నడును ॥ వారివిరహితములు అవి గొన్నాళ్ళకు । విరసంబులు మరి విఫలములు । నరహరి గొలి చిటు నమ్మినవరములు । నిరతము లెన్నడు నెలవులు చెడవు ॥ కమలాక్షుని మతిగాననిచదువులు । కుమతంబులు బహుకుపథములు । జమళి నచ్యుతుని సమారాధనలు । విమలములే కాని వితథముగావు ॥ శ్రీవల్లభుగతి జేరనిపదవులు । దావతులు కపటధర్మములు । శ్రీవేంకటపతి సేవించునేవలు । …

dolaayaanchala

అన్నమయ్య కీర్తన డోలాయాంచల రాగం: వరాళి డోలాయాం చల డోలాయాం హరే డోలాయామ్ ॥ మీనకూర్మ వరాహా మృగపతి​అవతారా । దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥ వామన రామ రామ వరకృష్ణ అవతారా । శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥ దారుణ బుద్ద కలికి దశవిధ​అవతారా । శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ ॥ 2 ॥

deva ee tagavu teerchavayyaa

deva ee tagavu teerchavayyaa – అన్నమయ్య కీర్తన దేవ యీ తగవు తీర్చవయ్యా దేవ యీ తగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నపమయ్యా ॥ తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా । పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడి కేగుదురయ్యా ॥ పొడుగుచు మనమున బొడమిన యాసలు అదన నెక్కడికి నరుగునయా । వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా ॥ లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని …

deva devam bhaje

అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే రాగం: ధన్నాసి దేవ దేవం భజే దివ్యప్రభావమ్ । రావణాసురవైరి రణపుంగవమ్ ॥ రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయమ్ । రాజారి కోదండ రాజ దీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రమ్ ॥ నీలజీమూత సన్నిభశరీరం ఘనవి- శాలవక్షం విమల జలజనాభమ్ । తాలాహినగహరం ధర్మసంస్థాపనం భూలలనాధిపం భోగిశయనమ్ ॥ పంకజాసనవినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనమ్ । లంకా విశోషణం లాలితవిభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతమ్ ॥

dasaratha rama

అన్నమయ్య కీర్తన రామా దశరథ రామా రామ దశరథరామ నిజ సత్య- కామ నమో నమో కాకుత్థ్సరామ ॥ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతిరామ । శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ ॥ దనుజహరణ రామ దశరథసుత రామ వినుతామర స్తోత్ర విజయరామ । మనుజావతారా రామ మహనీయ గుణరామ అనిలజప్రియ రామ అయోధ్యరామ ॥ సులలితయశ రామ సుగ్రీవ వరద రామ కలుష …