అన్నమయ్య కీర్తన డోలాయాంచల
రాగం: వరాళి
డోలాయాం చల డోలాయాం హరే డోలాయామ్ ॥
మీనకూర్మ వరాహా మృగపతిఅవతారా ।
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥
వామన రామ రామ వరకృష్ణ అవతారా ।
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥
దారుణ బుద్ద కలికి దశవిధఅవతారా ।
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ ॥ 2 ॥