అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే

రాగం: ధన్నాసి
దేవ దేవం భజే దివ్యప్రభావమ్ ।
రావణాసురవైరి రణపుంగవమ్ ॥
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయమ్ ।
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రమ్ ॥
నీలజీమూత సన్నిభశరీరం ఘనవి-
శాలవక్షం విమల జలజనాభమ్ ।
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనమ్ ॥
పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనమ్ ।
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతమ్ ॥