అన్నమయ్య కీర్తన తిరుమల గిరి రాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ । సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥ సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ । సరసవైభవరాయ సకలవినోదరాయ । వరవసంతములరాయ వనితలవిటరాయ । గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ॥ గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ । చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ । చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ । కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ॥ సామసంగీతరాయ సర్వమోహనరాయ । ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ । కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను । శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ॥
Recent Posts
teppagaa maraaku meeda
అన్నమయ్య కీర్తన తెప్పగా మర్రాకు మీద తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు । ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥ మోతనీటి మడుగులో యీతగరచినవాడు । పాతగిలే నూతిక్రింద బాయనివాడు । మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు । రోతయైన పేగుల పేరులు గలవాడు ॥ కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు । బూడిద బూసినవాని బుద్ధులవాడు । మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు । దూడల నావులగాచి దొరయైనవాడు ॥ ఆకసానబారే వూరి అతివల మానముల । కాకుసేయువాడు తురగముపైవాడు । …
suvvi suvvi suvvaalamma
అన్నమయ్య కీర్తన సువ్వి సువ్వి సువ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మా నవ్వుచు దేవకి నందను గనియె ॥ శశి వొడచె అలసంబులు గదచె దిశ దేవతల దిగుళ్ళు విడచె ॥ కావిరి విరసె కంసుడు గినిసె వావిరి పువ్వుల వానలు గురిసె ॥ గతి సేసె అటు గాడిద గూసె కుతిలకుడిచి జనకుడు నోరు మూసె ॥ గగురు పొడిచె లోకము విధి విడిచె మొగులు గురియగ యమునపై నదచె ॥ కలిజారె వేంకటపతి మీరె అలమేల్మంగ …
srimannaaraayana
అన్నమయ్య కీర్తన శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ । శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ॥ కమలాసతీ ముఖకమల కమలహిత । కమలప్రియ కమలేక్షణ । కమలాసనహిత గరుడగమన శ్రీ । కమలనాభ నీపదకమలమే శరణు ॥ పరమయోగిజన భాగధేయ శ్రీ । పరమపూరుష పరాత్పర పరమాత్మ పరమాణురూప శ్రీ । తిరువేంకటగిరి దేవ శరణు ॥
sobhaname sobhaname
అన్నమయ్య కీర్తన శోభనమే శోభనమే శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి ॥ అరుదుగ మును నరకాసురుడు । సిరులతో జెరలు దెచ్చిన సతుల । పరువపు వయసుల బదారు వేలను । సొరిది బెండ్లాడిన సుముఖునికి ॥ చెందిన వేడుక శిశుపాలుడు । అంది పెండ్లాడగ నవగళించి । విందువలెనె తా విచ్చేసి రుకుమిణి । సందడి బెండ్లాడిన సరసునుకి ॥ దేవదానవుల ధీరతను । దావతిపడి వార్థి దరుపగను । శ్రీ వనితామణి జెలగి …
siruta navvulavaadu
అన్నమయ్య కీర్తన సిరుత నవ్వులవాడు సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా ॥ పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెకా । గొలుసుల వంకల కోరలతోబూమి వెలిసినాడు సూడవే సిన్నెకా ॥ మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెకా । ఆటదానిబాసి అడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెకా ॥ బింకపు మోతల పిల్లగోవివాడు సింక సూపులవాడు సిన్నెకా । కొంకక కలికియై కొసరి కూడె నన్ను వేంకటేశుడు సూడవే …
satulaala choodare
అన్నమయ్య కీర్తన సతులాల చూడరే సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు । అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు ॥ వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు । ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు ॥ కొద దీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు …
sarvaantaraatmudavu
అన్నమయ్య కీర్తన సర్వాంతరాత్ముడవు సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను । సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ॥ వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి । కోరేటియపరాధాలు కొన్ని వేసి । నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ । దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ॥ మనసు చూడవలసి మాయలు నీవే కప్పి । జనులకు విషయాలు చవులుచూపి । కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి । ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ॥ వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే । కన్నకన్న భ్రమతలే కల్పించి । యిన్నిటా శ్రీవేంకటేశ …
sakalam he sakhi
అన్నమయ్య కీర్తన సకలం హే సఖి సకలం హే\f1 \f0 సఖి జానామె తత్ ప్రకత విలాసం పరమం దధసే ॥ అలిక మౄగ మద మయ మషి కలనౌ జ్వలతాహే సఖి జానామే । లలితం తవ పల్లవి తమనసి ని- స్చలతర మేఘ శ్యామం దధసే ॥ చారుకపొల స్థల కరాంకిత విచారం హే సఖి జానామే । నారయణ మహినాయక శయనం శ్రిరమనం తవ చిత్తే దధసే ॥ ఘన కుచ శైల …
Ranga ranga rangapati
అన్నమయ్య కీర్తన రంగ రంగ రంగపతి రాగం: సింధు భైరవ రంగ రంగ రంగ పతి రంగనాధా నీ । సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా ॥ పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు । ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె । రట్టడివి మేరమీరకు రంగనాధా । రంగనాధా శ్రీ రంగనాధా ॥ కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి । రావు పోవు ఎక్కడికి రంగ నాధా । శ్రీ …