Recent Posts

keerthanas duduku gala

త్యాగరాజ పంచరత్న కీర్తన దుడుకు గల కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: గౌళ తాళం: ఆది దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర దుడుకు గల నన్నే దొర సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన దుడుకు గల నన్నే దొర చిరుత ప్రాయమున నాడే భజనామృత …

Marugelara o raghava

త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా! మరుగేల – చరా చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత

Brova bharama

త్యాగరాజ కీర్తన బ్రోవ భారమా బ్రోవ భారమా, రఘు రామ భువనమెల్ల నేవై, నన్నొకని శ్రీ వాసుదేవ! అండ కోట్ల కుక్షిని ఉంచుకోలేదా, నన్ను కలశాంబుధిలో దయతో అమరులకై, అది గాక గోపికలకై కొండలెత్త లేదా కరుణాకర, త్యాగరాజుని

samaja vara gamana

త్యాగరాజ కీర్తన సామజ వర గమనా సామజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత సామని గమజ – సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ వేదశిరో మాతృజ – సప్త స్వర నాదా చల దీప స్వీకృత యాదవకుల మురళీవాదన వినోద మోహన కర, త్యాగరాజ వందనీయ

Bantu reethikoluvu

త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు బంటు రీతి కొలువీయ వయ్య రామ తుంట వింటి వాని మొదలైన మదాదుల బట్టి నేల కూలజేయు నిజ రోమాంచమనే, ఘన కంచుకము రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు రామ నామమనే, వర ఖఢ్గమి విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

kamadhenuvide

అన్నమయ్య కీర్తన కామధేనువిదే కామధేను విదే కల్పవృక్ష మిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు ॥ హరినామజపమే ఆభరణంబులు పరమాత్మునినుతి పరిమళము । దరణిదరు పాదసేవే భోగము పరమంబెరిగిన ప్రపన్నులకు ॥ దేవుని ధ్యానము దివ్యాన్నంబులు శ్రీవిభు భక్తే జీవనము । ఆవిష్ణు కైంకర్యమే సంసారము పావనులగు యీ ప్రపన్నులకు ॥ యేపున శ్రీవేంకటేశుడే సర్వము దాపై యితని వందనమే విధి । కాపుగ శరణాగతులే చుట్టాలు పై పయి గెలిచిన ప్రపన్నులకు ॥

viswaroopamidivo

అన్నమయ్య కీర్తన విశ్వరూపమిదివో విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము ॥ కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు । నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము ॥ మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర మాడనే వాలిన పక్షుల మరులు । వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము యీడమాకు పొడచూపె ఇహమేపోపరము ॥ కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి యీటులేని శ్రీ వేంకటేశుడితడు । వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ కూటువైనన్నేలితి …

vinnapaalu vinavale

అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె రాగం: భూపాళం విన్నపాలు వినవలె వింత వింతలు । పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ తెల్లవారె జామెక్కె దేవతలు మునులు । అల్లనల్ల నంతనింత నదిగోవారే । చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు । మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ॥ గరుడ కిన్నరయక్ష కామినులు గములై । విరహపు గీతముల వింతాలాపాల । పరిపరివిధముల బాడేరునిన్నదివో । సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ॥ పొంకపు శేషాదులు తుంబురునారదాదులు । పంకజభవాదులు నీ …

viduva viduvaninka

అన్నమయ్య కీర్తన విడువ విడువనింక రాగం: సూర్యకాంతం విడువవిడువనింక విష్ణుడ నీపాదములు కడగి సంసారవార్థి కడుముంచుకొనిన ॥ పరమాత్మ నీవెందో పరాకైయున్నాను పరగ నన్నింద్రియాలు పరచినాను । ధరణిపై చెలరేగి తనువు వేసరినాను దురితాలు నలువంక~ం దొడికి తీసినను ॥ పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ వట్టి ముదిమైన రానీ వయసే రానీ । చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు ॥ యీదేహమే యయిన ఇక నొకటైనాను కాదు గూడదని ముక్తి …

vedukondaamaa

అన్నమయ్య కీర్తన వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ॥ ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు । తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ॥ వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు । గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ॥ ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు । అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ॥