అన్నమయ్య కీర్తన సర్వాంతరాత్ముడవు సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను । సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ॥ వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి । కోరేటియపరాధాలు కొన్ని వేసి । నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ । దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ॥ మనసు చూడవలసి మాయలు నీవే కప్పి । జనులకు విషయాలు చవులుచూపి । కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి । ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ॥ వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే । కన్నకన్న భ్రమతలే కల్పించి । యిన్నిటా శ్రీవేంకటేశ …
Recent Posts
sakalam he sakhi
అన్నమయ్య కీర్తన సకలం హే సఖి సకలం హే\f1 \f0 సఖి జానామె తత్ ప్రకత విలాసం పరమం దధసే ॥ అలిక మౄగ మద మయ మషి కలనౌ జ్వలతాహే సఖి జానామే । లలితం తవ పల్లవి తమనసి ని- స్చలతర మేఘ శ్యామం దధసే ॥ చారుకపొల స్థల కరాంకిత విచారం హే సఖి జానామే । నారయణ మహినాయక శయనం శ్రిరమనం తవ చిత్తే దధసే ॥ ఘన కుచ శైల …
Ranga ranga rangapati
అన్నమయ్య కీర్తన రంగ రంగ రంగపతి రాగం: సింధు భైరవ రంగ రంగ రంగ పతి రంగనాధా నీ । సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా ॥ పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు । ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె । రట్టడివి మేరమీరకు రంగనాధా । రంగనాధా శ్రీ రంగనాధా ॥ కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి । రావు పోవు ఎక్కడికి రంగ నాధా । శ్రీ …
Radha madhava rati charitamiti
అన్నమయ్య కీర్తన రాధా మాధవ రతి చరితమితి రాధామాధవరతిచరితమితి బోధావహం శ్రుతిభూషణమ్ ॥ గహనే ద్వావపి గత్వా గత్వా రహసి రతిం ప్రేరయతి సతి । విహరతస్తదా విలసంతౌ విహతగృహాశౌ వివశౌ తౌ ॥ లజ్జాశభళ విలాసలీలయా కజ్జలనయన వికారేణ । హృజ్జావ్యవనహిత హృదయా రతి స్సజ్జా సంభ్రమచపలా జాతా ॥ పురతో యాంతం పురుషం వకుళైః కురంటకైర్వా కుటజైర్వా । పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా- గిరం వినాసి వికిరతి ముదమ్ ॥ హరి సురభూరుహ మారోహతీవ …
Raamudu raaghavudu
అన్నమయ్య కీర్తన రాముడు రాఘవుడు రాగం: కానడ రాముడు రాఘవుడు రవికులు డితడు । భూమిజకు పతియైన పురుష నిధానము ॥ అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున । పరగ జనించిన పర బ్రహ్మము । సురల రక్షింపగ అసురుల శిక్షింపగ । తిరమై ఉదయించిన దివ్య తేజము ॥ చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో । సంతతము నిలిచిన సాకారము । వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి । కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము …
Raamudu lokaabhiraamudu
అన్నమయ్య కీర్తన రాముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు త్రైలోక్య ధాముడు రణరంగ భీముడు వాడే ॥ వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు శరుడు రాక్షస సంహరుడు వాడే । స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా గురుడు సేవకశుభకరుడు వాడే ॥ ధీరుడు లోకైకవీరుడు సకలా ధారుడు భవబంధదూరుడు వాడే । శూరుడు ధర్మవిచారుడు రఘువంశ సారుడు బ్రహ్మసాకారుడు వాడే ॥ బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే । వెలసి శ్రీ వేంకటాద్రి …
Raajeeva netraaya
అన్నమయ్య కీర్తన రాజీవ నేత్రాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో । సౌజన్య నిలయాయ జానకీశాయ ॥ దశరథ తనూజాయ తాటక దమనాయ కుశిక సంభవ యజ్ఞ గోపనాయ । పశుపతి మహా ధనుర్భంజనాయ నమో విశద భార్గవరామ విజయ కరుణాయ ॥ భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ ఖరదూషణాయ రిపు ఖండనాయ । తరణి సంభవ సైన్య రక్షకాయనమో నిరుపమ మహా వారినిధి బంధనాయ ॥ హత రావణాయ సంయమి నాథ వరదాయ అతులిత అయోధ్యా …
puttu bhogulamu memu
అన్నమయ్య కీర్తన పుట్టు భోగులము మేము పుట్టుభోగులము మేము భువి హరిదాసులము । నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ॥ పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు । తల్లియాకె మగనినే దైవమని కొలిచేము వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ॥ గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు ఆమని భూకాంతకు నంగభేదాలు ॥ భామిని యాకె మగని ప్రాణధారి లెంక- లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ॥ పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు వెస …
podagantimayaa
అన్నమయ్య కీర్తన పొడగంటిమయ్య రాగం:అట్టతాళం పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా ॥ కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా । గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా ॥ భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ । కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము తావై రక్షించేటి ధరణీధరా ॥ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా లడచి రక్షించే దివ్యౌషధమా । బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము …
pidikita talambraala
అన్నమయ్య కీర్తన పిడికిట తలంబ్రాల పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత । పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ॥ పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద । పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు । పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు । పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ॥ బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర । బిరుదు మగని కంటె బెండ్లి కూతురు । పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ …
