Recent Posts

nallani meni

అన్నమయ్య కీర్తన నల్లని మేని నల్లని మేని నగవు చూపుల వాడు । తెల్లని కన్నుల దేవుడు ॥ బిరుసైన దనుజుల పింఛమణచినట్టి । తిరుపు కైదువ తోడి దేవుడు । సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి । తెరవు చూపినట్టి దేవుడు ॥ నీటగలసినట్టి నిండిన చదువులు । తేట పరచినట్టి దేవుడు । పాటిమాలినట్టి ప్రాణుల దురితపు । తీట రాసినట్టి దేవుడు ॥ గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న । తిరువేంకటాద్రిపై దేవుడు …

nagavulu nijamini

అన్నమయ్య కీర్తన నగవులు నిజమని నగవులు నిజమని నమ్మేదా । వొగినడియాసలు వొద్దనవే ॥ తొల్లిటి కర్మము దొంతల నుండగ । చెల్లబోయిక జేసేదా । యెల్ల లోకములు యేలేటి దేవుడ । వొల్ల నొల్లనిక నొద్దనవే ॥ పోయిన జన్మము పొరుగులనుండగ । చీయనక యిందు జెలగేదా । వేయినామముల వెన్నుడమాయలు । ఓ యయ్య యింక నొద్దనవే ॥ నలి నీనామము నాలికనుండగ । తలకొని యితరము దడవేదా । బలు శ్రీ వేంకటపతి …

muddugaare yasoda

అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద రాగం: సాళంగనాట ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు । తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥ అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము । పంత మాడే కంసుని పాలి వజ్రము । కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస । చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు ॥ రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము । మితి గోవర్ధనపు గోమేధికము । సతమై శంఖ చక్రాల …

meloko srungaararaaya

అన్నమయ్య కీర్తన మేలుకో శ్రుంగారరాయ మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల । మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ॥ సందడిచే గోపికల జవ్వనవనములోన । కందువందిరిగే మదగజమవు । యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని । గంధము మరిగినట్టి గండు తుమ్మెద ॥ గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో । రతిముద్దు గురిసేటి రాచిలుకా । సతుల పదారువేల జంట కన్నుల గలువల- । కితమై పొడిమిన నా యిందు బింబమ ॥ వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై …

medini jeevula gaava

అన్నమయ్య కీర్తన మేదిని జీవుల గావ మేదిని జీవుల గావ మేలుకోవయ్యా । నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥ తగుగోపికల కన్నుదామరలు వికసించె మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా । తెగువ రాక్షసులనే తిమిరము విరియగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ॥ ఘనదురితపు గలువలు వికసించె మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా । పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ॥ వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ మెరయు దోషరహిత మేలుకోవయ్యా …

mangaambudhi hanumantaa

అన్నమయ్య కీర్తన మంగాంబుధి హనుమంతా రాగం: ధర్మవతి, తాళం: ఆది మంగాంబుధి హనుమంతా నీ శరణ । మంగవించితిమి హనుమంతా ॥ బాలార్క బింబము ఫలమని ప ట్టిన ఆలరి చేతల హనుమంతా । తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనినా హనుమంతా ॥ జలధి దాట నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంతా । ఇలయు నాకసము నేకముగా, నటు బలిమి పెరిగితివి భళి హనుమంతా ॥ పాతాళము లోపలి మైరావణు ఆతల జంపిన …

mahinudyogi kaavale

అన్నమయ్య కీర్తన మహినుద్యోగి కావలె మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు । సహజి వలె నుండి ఏమి సాధించలెడు ॥ వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు । చెదరి మరచితే సృష్టి చీకటౌ । పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు । నిదురించితే కాలము నిమిషమై తోచు ॥ వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ । జాడతో నూరకుండితే జడుడౌను । వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ । కూడక సోమరి ఐతే గుణహీనుడౌను ॥ మురహరు …

maccha kurma varaha

అన్నమయ్య కీర్తన మచ్చ కూర్మ వరాహ మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ ॥ నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన । వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ ॥ కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా । తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా జంటవాయుకు మచ్యుత జనార్దన ॥ మొక్కేము వుపేంద్ర …

Laali sree krishunayya

లన్నమయ్య కీర్తన లాలి శ్రీ కృష్నయ్య లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ నవ నీల మేఘవర్ణ బాలగోపాలపాల పవ్వళింపరా సింగారించిన మంచి బంగారు ఊయలలోన మరి బంగారు ఊయలలోన శంఖు చక్రథరస్వామి నిదురపోరా లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా నీకు లలనాయె కావలెనా పలుకు కోయిల సత్యభామయె కావలెనా అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగను అతి సందడిగ మ్రోయగను అందముగాను నీవు పవ్వలింపరా పగడాల పతకాలు కంఠనా ధరియించి నీ కంఠనా ధరియించి వంగేవు తొంగేవు …

kulukuga nadavaro

అన్నమయ్య కీర్తన కులుకుగ నడవరో రాగం: దేసాళం కులుకక నడవరో కొమ్మలాలా । జలజల రాలీని జాజులు మాయమ్మకు ॥ ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా । పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు ॥ చల్లెడి గందవొడియై జారీ నిలువరో పల్లకి వట్టిన ముద్దు బణతులాల । మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు ॥ జమళి ముత్యాల …