అన్నమయ్య కీర్తన ఫాల నేత్రానల ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా ॥ ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా । కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- చలన విధినిపుణ నిశ్చల నారసింహా ॥ వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- లవదివ్య పరుష లాలాఘటనయా । వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా ॥ దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి- కార స్ఫులింగ సంగక్రీడయా । వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- కారణ ప్రకట వేంకట …
Recent Posts
periginaadu choodaro
అన్నమయ్య కీర్తన పెరిగినాడు చూడరోఇ పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు । పరగి నానా విద్యల బలవంతుడు ॥ రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు । దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు ॥ లలిమీరిన యట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు । నెలకొన్న లంకా నిర్థూమధాముడు తలపున శ్రీరాము నాత్మారాముడు ॥ దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపః ఫల పుణ్యుడు । శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు …
pavanatmaja o ghanudaa
అన్నమయ్య కీర్తన పవనాత్మజ ఓ ఘనుడా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా । ఓ హనుమంతుడ ఉదయాచల ని- ర్వాహక నిజ సర్వ ప్రబలా । దేహము మోచిన తెగువకు నిటువలె సాహస మిటువలె చాటితిగా ॥ ఓ రవి గ్రహణ ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా । దారుణపు వినతా తనయాదులు గారవింప నిటు కలిగితిగా ॥ ఓ దశముఖ హర ఓ వేంకటపతి- పాదసరోరుహ పాలకుడా । ఈ దేహముతో …
paluku tenela talli
అన్నమయ్య కీర్తన పలుకు తేనెల తల్లి రాగం: సాళంగనాట పలుకు దేనెల తల్లి పవళించెను । కలికి తనముల విభుని గలసినది గాన ॥ నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను । తెగని పరిణతులతో తెల్లవారినదాక జగదేక పతి మనసు జట్టి గొనె గాన ॥ కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి బంగారు మేడపై బవళించెను । చెంగలువ కనుగొనల సింగారములు దొలక అంగజ గురునితోడ నలసినదిగాన …
okapari kokapari
అన్నమయ్య కీర్తన ఒకపరి కొకపరి రాగం: ఖరహరప్రియ పెద తిరుమలాచర్యుల రచన ఒకపరి కొకపరి కొయ్యారమై । మొకమున కళలెల్ల మొలచినట్లుండె ॥ జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి । జిగికొని నలువంక చిందగాను । మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన । పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె ॥ పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు । కరగి ఇరుదెసల కారగాను । కరిగమన విభుడు గనుక మోహమదము । తొరిగి సామజసిరి తొలికినట్లుండె ॥ మెరయ శ్రీవేంకటేశుమేన …
nitya poojalivigo
అన్నమయ్య కీర్తన నిత్య పూజలివిగో నిత్య పూజలివిగో నెరిచిన నోహో । ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ॥ తనువే గుడియట తలయె శిఖరమట పెను హృదయమే హరి పీఠమట । కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని ॥ పలుకే మంత్రమట పాదయిన నాలుకే కలకల మను పిడి ఘంటయట । నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు ॥ గమన చేష్టలే అంగరంగ గతియట తమి గల జీవుడే దాసుడట । …
Nimushamedategaka
అన్నమయ్య కీర్తన నిముషమెడతెగక నిముషమెడతెగక హరి నిన్ను తలచి । మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ॥ నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి । కదిసి కోరినను గతకాలంబు వచ్చునే మది మదినె యుండి ఏమరక బతుకుట గాక ॥ కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత వెడయాసలకు కొంత వెట్టిసేసి । అడరి కావలెననిన అందు సుఖమున్నదా చెడక నీ సేవలే సేసి బతుకుటగాక ॥ ధనము వెంట …
nigama nigamaanta varnita
అన్నమయ్య కీర్తన నిగమ నిగమాంత వర్ణిత నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా ॥ దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- నోపకరా నన్ను నొడబరపుచు । పైపైనె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా ॥ చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- లేకకా నీవు బహులీల నన్ను । కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా ॥ వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా । దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణా …
Nelamoodu sobhanaalu
అన్నమయ్య కీర్తన నెలమూడు శోభనాలు నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు । కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ॥ రామనామమతనిది రామవు నీవైతేను । చామన వర్ణమతడు చామవు నీవు । వామనుడందురతని వామనయనవు నీవు । ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ॥ హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు । కరిగాచెదాను నీవు కరియానవు । సరి జలధిశాయి జలధికన్యవు నీవు । బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ॥ జలజ నాభుడతడు జలజముఖివి నీవు । అలమేలుమంగవు నిన్నెలమెదాను । …
Navarasamuladee nalinaakshi
అన్నమయ్య కీర్తన నవరసములదీ నళినాక్షి నవరసములదీ నళినాక్షి । జవకట్టి నీకు జవి సేసీని ॥ శృంగార రసము చెలియ మొకంబున । సంగతి వీరరసము గోళ్ళ । రంగగు కరుణరసము పెదవులను । అంగపు గుచముల నద్భుత రసము ॥ చెలి హాస్యరసము చెలవుల నిండీ । పలుచని నడుమున భయరసము । కలికి వాడుగన్నుల భీభత్సము । అల బొమ జంకెనల నదె రౌద్రంబు ॥ రతి మరపుల శాంతరసంబదె । అతి మోహము …
