Recent Posts

paluku tenela talli

అన్నమయ్య కీర్తన పలుకు తేనెల తల్లి రాగం: సాళంగనాట పలుకు దేనెల తల్లి పవళించెను । కలికి తనముల విభుని గలసినది గాన ॥ నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను । తెగని పరిణతులతో తెల్లవారినదాక జగదేక పతి మనసు జట్టి గొనె గాన ॥ కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి బంగారు మేడపై బవళించెను । చెంగలువ కనుగొనల సింగారములు దొలక అంగజ గురునితోడ నలసినదిగాన …

okapari kokapari

అన్నమయ్య కీర్తన ఒకపరి కొకపరి రాగం: ఖరహరప్రియ పెద తిరుమలాచర్యుల రచన ఒకపరి కొకపరి కొయ్యారమై । మొకమున కళలెల్ల మొలచినట్లుండె ॥ జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి । జిగికొని నలువంక చిందగాను । మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన । పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె ॥ పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు । కరగి ఇరుదెసల కారగాను । కరిగమన విభుడు గనుక మోహమదము । తొరిగి సామజసిరి తొలికినట్లుండె ॥ మెరయ శ్రీవేంకటేశుమేన …

nitya poojalivigo

అన్నమయ్య కీర్తన నిత్య పూజలివిగో నిత్య పూజలివిగో నెరిచిన నోహో । ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ॥ తనువే గుడియట తలయె శిఖరమట పెను హృదయమే హరి పీఠమట । కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని ॥ పలుకే మంత్రమట పాదయిన నాలుకే కలకల మను పిడి ఘంటయట । నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు ॥ గమన చేష్టలే అంగరంగ గతియట తమి గల జీవుడే దాసుడట । …

Nimushamedategaka

అన్నమయ్య కీర్తన నిముషమెడతెగక నిముషమెడతెగక హరి నిన్ను తలచి । మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ॥ నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి । కదిసి కోరినను గతకాలంబు వచ్చునే మది మదినె యుండి ఏమరక బతుకుట గాక ॥ కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత వెడయాసలకు కొంత వెట్టిసేసి । అడరి కావలెననిన అందు సుఖమున్నదా చెడక నీ సేవలే సేసి బతుకుటగాక ॥ ధనము వెంట …

nigama nigamaanta varnita

అన్నమయ్య కీర్తన నిగమ నిగమాంత వర్ణిత నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా ॥ దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- నోపకరా నన్ను నొడబరపుచు । పైపైనె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా ॥ చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- లేకకా నీవు బహులీల నన్ను । కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా ॥ వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా । దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణా …

Nelamoodu sobhanaalu

అన్నమయ్య కీర్తన నెలమూడు శోభనాలు నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు । కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ॥ రామనామమతనిది రామవు నీవైతేను । చామన వర్ణమతడు చామవు నీవు । వామనుడందురతని వామనయనవు నీవు । ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ॥ హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు । కరిగాచెదాను నీవు కరియానవు । సరి జలధిశాయి జలధికన్యవు నీవు । బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ॥ జలజ నాభుడతడు జలజముఖివి నీవు । అలమేలుమంగవు నిన్నెలమెదాను । …

Navarasamuladee nalinaakshi

అన్నమయ్య కీర్తన నవరసములదీ నళినాక్షి నవరసములదీ నళినాక్షి । జవకట్టి నీకు జవి సేసీని ॥ శృంగార రసము చెలియ మొకంబున । సంగతి వీరరసము గోళ్ళ । రంగగు కరుణరసము పెదవులను । అంగపు గుచముల నద్భుత రసము ॥ చెలి హాస్యరసము చెలవుల నిండీ । పలుచని నడుమున భయరసము । కలికి వాడుగన్నుల భీభత్సము । అల బొమ జంకెనల నదె రౌద్రంబు ॥ రతి మరపుల శాంతరసంబదె । అతి మోహము …

Navanita chora namo namo

అన్నమయ్య కీర్తన నవనీతచోరా నమో నమో నవనీతచోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో ॥ హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ నరసింహ వామన నమో నమో । మురహర పద్మ నాభ ముకుంద గోవింద నరనారాయణరూప నమో నమో ॥ నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ నగధర నందగోప నమో నమో । త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక నగరాధినాయక నమో నమో ॥ వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర నాకేశవందిత నమో నమో । శ్రీకరగుణనిధి …

Naraayanaaya namo namo

అన్నమయ్య కీర్తన నారాయణాఅయ నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥ గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో । దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥ దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో …

naraayanaachyuta

అన్నమయ్య కీర్తన నారాయణాచ్యుత నారాయణాచ్యుతానంత గోవింద హరి । సారముగ నీకు నే శరణంటిని ॥ చలువయును వేడియును నటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ । ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు పులుపు దీపును గలపి భుజియించినట్లు ॥ పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తనుదానె తొలగు । నగియించు నొకవేళ నలగించు నొకవేళ వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ॥ ఇహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము విహరించు భ్రాంతియును …