అన్నమయ్య కీర్తన నవరసములదీ నళినాక్షి
నవరసములదీ నళినాక్షి ।
జవకట్టి నీకు జవి సేసీని ॥
శృంగార రసము చెలియ మొకంబున ।
సంగతి వీరరసము గోళ్ళ ।
రంగగు కరుణరసము పెదవులను ।
అంగపు గుచముల నద్భుత రసము ॥
చెలి హాస్యరసము చెలవుల నిండీ ।
పలుచని నడుమున భయరసము ।
కలికి వాడుగన్నుల భీభత్సము ।
అల బొమ జంకెనల నదె రౌద్రంబు ॥
రతి మరపుల శాంతరసంబదె ।
అతి మోహము పదియవరసము ।
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి ।
సతమై యీపెకు సంతోస రసము ॥