Recent Posts

Evarani nirnayinchirira

ఎవరని నిర్ణయించిరిరా రాగం: దేవామృతవర్షిణి తాళం: దేశాది పల్లవి ఎవరని నిర్ణయించిరిరా ని న్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥ అను పలవి శివుడనో మాధవుడనో కమల భవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥ చరణము(లు) శివమంత్రమునకు మా జీవము మా ధవమంత్రమునకు రాజీవము ఈ వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥ న్నెట్లారిధించిరిరా ॥

Nagumomu ganaleni

త్యాగరాజ కీర్తన నగుమోము గనలేని రాగం: ఆభేరి (మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ) ఆరోహణ: శ్ ఘ2 ం1 ఫ్ ణ2 శ్ అవరోహణ: శ్ ణ2 డ2 ఫ్ ం1 ఘ2 ఱ2 శ్ తాళం: ఆది రూపకర్త: త్యాగరాజ భాషా: తెలుగు పల్లవి నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ అనుపల్లవి నగరాజధర నీదు పరైవార లెల్ల ఒగిబోధన జేసే వారలు గారే యిటు లుండుదురె (నగుమోము) చరణం ఖగరాజు నీ యానతి విని వేగ …

Gandhamu puyaruga

త్యాగరాజ కీర్తన గంధము పూయరుగా రాగం: పున్నాగవరాళి తాళం: ఆది పల్లవి: గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అను పల్లవి: అందమయిన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ ॥గంధము॥ తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకలమను ముఖకళగని సొక్కుచు బలుకుల నమృతము లొలికెడు స్వామికి ॥గంధము॥ చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా మాలిమితో గోపాలబాలులతో నాల మేపిన విశాలనయనునికి ॥గంధము॥ హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా నారీమణులకు వారము యౌవన వారక యొసగెడు వారిజాక్షునికి …

keerthanas kana kana ruchira

త్యాగరాజ పంచరత్న కీర్తన కన కన రుచిరా కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: వరాళి తాళం: ఆది కన కన రుచిరా కనక వసన నిన్ను దిన దినమును అనుదిన దినమును మనసున చనువున నిన్ను కన కన రుచిర కనక వసన నిన్ను పాలుగారు మోమున శ్రీయపార మహిమ కనరు నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను కళకళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను కన కన …

endaro mahanubhavulu

త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: శ్రీ తాళం: ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ …

samayaniki tagu mataladene

త్యాగరాజ పంచరత్న కీర్తన సమయానికి తగు మాటలాడెనె కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: ఆరభి తాళం: ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక …

agadananda karaka

త్యాగరాజ పంచరత్న కీర్తన జగదానంద కారక కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: నాట్టై తాళం: ఆది జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా జగదానంద కారకా గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల జగదానంద కారకా అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక …

keerthanas duduku gala

త్యాగరాజ పంచరత్న కీర్తన దుడుకు గల కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: గౌళ తాళం: ఆది దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర దుడుకు గల నన్నే దొర సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన దుడుకు గల నన్నే దొర చిరుత ప్రాయమున నాడే భజనామృత …

Marugelara o raghava

త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా! మరుగేల – చరా చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత

Brova bharama

త్యాగరాజ కీర్తన బ్రోవ భారమా బ్రోవ భారమా, రఘు రామ భువనమెల్ల నేవై, నన్నొకని శ్రీ వాసుదేవ! అండ కోట్ల కుక్షిని ఉంచుకోలేదా, నన్ను కలశాంబుధిలో దయతో అమరులకై, అది గాక గోపికలకై కొండలెత్త లేదా కరుణాకర, త్యాగరాజుని