అన్నమయ్య కీర్తన ఘనుడాతడే మము ఘనుడాతడే మము గాచుగాక హరి అనిశము నేమిక నతనికె శరణు ॥ యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు యెవ్వడు రక్షకుడిన్నిటికి । యెవ్వని మూలము యీ సచరాచర మవ్వల నివ్వల నతనికే శరణు ॥ పురుషోత్తముడని పొగడి రెవ్వరిని కరి నెవ్వడు గాచె । ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె అరుదుగ మేమిక నతనికె శరణు ॥ శ్రీసతి యెవ్వని జేరి వురమునను భాసిల్లె నెవ్వడు పరమంబై । దాసుల కొరకై …
