అన్నమయ్య కీర్తన జయ జయ రామా జయ జయ రామా సమరవిజయ రామా । భయహర నిజభక్తపారీణ రామా ॥ జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా । అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా ॥ అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా । ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా ॥ అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా । వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా ॥
Recent Posts
itti muddulaadu
అన్నమయ్య కీర్తన ఇట్టి ముద్దులాడు రాగం: దేవగాంధారి ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ॥ గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి । చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ॥ ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి తచ్చెడి పెరుగులోన దగబెట్టి । నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార వొచ్చెలి …
itarulaku ninu
అన్నమయ్య కీర్తన ఇతరులకు నిను ఇతరులకు నిను నెరుగదరమా ॥ సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితులెరుగుదురు నిను నిందిరారమణా ॥ నారీకటాక్షపటునారాచభయరహిత- శూరులెరుగుదురు నిను జూచేటిచూపు । ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు- ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము ॥ రాగభోగవిదూర రంజితాత్ములు మహా- భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము । ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా- యోగులెరుగుదురు నీవుండేటివునికి ॥ పరమభాగవత పదపద్మసేవానిజా- భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు । పరగునిత్యానంద పరిపూర్ణమానస- స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ॥
ippuditu kalaganti
అన్నమయ్య కీర్తన ఇప్పుడిటు కలగన్టి రాగం: భూపాళం ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు । అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ॥ అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి । ప్రతిలేని గోపుర ప్రభలు గంటి । శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి । చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి ॥ కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి । ఘనమైన దీపసంఘములు గంటి । అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి । కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి ॥ అరుదైన శంఖ …
hari yavataara mitadu
అన్నమయ్య కీర్తన హరి యవతార మితడు హరి యవతార మీతడు అన్నమయ్య । అరయ మా గురుడీతడు అన్నమయ్య । వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య । ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ॥ ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య । భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య …
hari naamamu kadu
అన్నమయ్య కీర్తన హరి నామము కడు హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా ॥ నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము । ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో మనసా ॥ నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము । సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో పొగడవో పొగడవో మనసా ॥ కడగి శ్రీవేంకటపతి నామము ఒడి ఒడినే సంపత్కరము । అడియాలం బిల నతి సుఖమూలము తడవవో తడవవో తడవవో మనసా ॥
govindaasrita gokulabrundaa
అన్నమయ్య కీర్తన గోవిందాశ్రిత గోకులబృందా గోవిందాశ్రిత గోకులబృందా । పావన జయజయ పరమానంద ॥ జగదభిరామ సహస్రనామ । సుగుణధామ సంస్తుతనామ । గగనశ్యామ ఘనరిపు భీమ । అగణిత రఘువంశాంబుధి సోమ ॥ జననుత చరణా శరణ్యు శరణా । దనుజ హరణ లలిత స్వరణా । అనఘ చరణాయత భూభరణా । దినకర సన్నిభ దివ్యాభరణా ॥ గరుడ తురంగా కారోత్తుంగా । శరధి భంగా ఫణి శయనాంగా । కరుణాపాంగా కమల సంగా …
ghanudaatade mamu
అన్నమయ్య కీర్తన ఘనుడాతడే మము ఘనుడాతడే మము గాచుగాక హరి అనిశము నేమిక నతనికె శరణు ॥ యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు యెవ్వడు రక్షకుడిన్నిటికి । యెవ్వని మూలము యీ సచరాచర మవ్వల నివ్వల నతనికే శరణు ॥ పురుషోత్తముడని పొగడి రెవ్వరిని కరి నెవ్వడు గాచె । ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె అరుదుగ మేమిక నతనికె శరణు ॥ శ్రీసతి యెవ్వని జేరి వురమునను భాసిల్లె నెవ్వడు పరమంబై । దాసుల కొరకై …
garuda gamana garudadhvaja
అన్నమయ్య కీర్తన గరుడ గమన గరుడధ్వజ గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో ॥ కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక । కమలనయన కమలాప్తకుల నమోనమో హరి నమో నమో ॥ జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల । జలధిజామాత జలధిగంభీర హలధర నమో హరి నమో ॥ ఘనదివ్యరూప ఘనమహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ । అనఘ శ్రీవేంకటాధిపతేహం నమో నమోహరి నమో నమో ॥
gaaline poya
అన్నమయ్య కీర్తన గాలినే పోయ గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు ॥ అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము । ఒడలికి జీవుని కొడయడైనహరి దడవగా గొంతయు బొద్దులేదు ॥ కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము । తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు । శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె గరిమల గపటాల గలకాలము । తిరువేంకటగిరి దేవుడైనహరి దరిచేరా …