దాశరథీ శతకం శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥ రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో ద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 2 ॥ అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ విగత సమస్తదోష, పృథివీసురతోష, …
Recent Posts
e teeruga nanu daya choochedavo
రామదాసు కీర్తన ఏ తీరుగ నను దయ చూచెదవో ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా …
paluke bangaaramaayena
రామదాసు కీర్తన పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ ఎంత వేడినగాని సుంతైన దయరాదు పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ రాతి నాతిగ చేసి భూతలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా కరుణించు భద్రాచల వరరామదాస పోష
ikshvaku kula tilaka
ikshvaku kula tilaka – రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ.. చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ 1 ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ॥ 2 ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా ఆ …
paramatmudu velige
పరమాత్ముడు వెలిగే రాగం: వాగధీశ్వరీ తాళం: ఆది పల్లవి పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే అనుపల్లవి హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులటయందరిలో (పరమ) చరనం గగనాఅనిల తేజో-జల భూ-మయమగు మృగ ఖగ నగ తరు కోటులలో 5సగుణములో 6విగుణములో సతతము సాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)
sri rama paadama
శ్రీ రామ పాదమా రాగం: అమృతవాహినీ తాళం: ఆది పల్లవి శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అనుపల్లవి వారిజ భవ సనక సనందన వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ) చరనం దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ శూర అహల్యను జూచి బ్రోచితివి ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)
bhajamyaham
శ్రీ గణనాథం భజామ్యహం రాగం: కనకాంగి (1 కనకాంగి మేళ) తాళం: ఆది పల్లవి శ్రీ గణ నాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థ ఫలదం అనుపల్లవి శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ) చరనం రంజిత నాటక రంగ తోషణం శింజిత వర మణి-మయ భూషణం 1ఆంజనేయావతారం 2సుభాషణం కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)
ganamurte sri krushnavenu
గానమూర్తే శ్రీకృష్ణవేణు రాగం: గానమూర్తి తాళం: ఆది పల్లవి గానమూర్తే శ్రీకృష్ణవేణు గానలోల త్రిభువనపాల పాహి (గా) అను పల్లవి మానినీమణి శ్రీ రుక్మిణి మానసాపహార మారజనక దివ్య (గా) చరణము(లు) నవనీతచోర నందసత్కిశోర నరమిత్రధీర నరసింహ శూర నవమేఘతేజ నగజాసహజ నరకాంతకాజ నరత్యాగరాజ (గా)
Nanu palima nadachi vachchitivo
నను పాలింప నడచి వచ్చితివో రాగం: మోహనం (28 హరికాంభోజి జన్య) తాళం: ఆది పల్లవి నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణ నాథ అనుపల్లవి వనజ నయన మోమును జూచుట జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను) చరణం సురపతి నీల మణి నిభ తనువుతో ఉరమున ముత్యపు సరుల చయముతో కరమున శర కోదండ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)
vandanamu raghunandana
వందనము రఘునందన రాగం: శహన రాగము తాళం: ఆది తాళము పల్లవి వందనము రఘునందన – సేతు బంధన భక్త చందన రామ చరణము(లు) శ్రీదమా నాతో వాదమా – నే భేదమా ఇది మోదమా రామ శ్రీరమా హృచ్చార మము బ్రోవ భారమా రాయబారమా రామ వింటిని నమ్ము కొంటిని శర ణంటిని రమ్మంటిని రామ ఓడను భక్తి వీడను నొరుల వేడను జూడను రామ కమ్మని విడె మిమ్మని వరము కొమ్మని పలుక రమ్మని రామ న్యాయమా …