పరమాత్ముడు వెలిగే రాగం: వాగధీశ్వరీ తాళం: ఆది పల్లవి పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే అనుపల్లవి హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులటయందరిలో (పరమ) చరనం గగనాఅనిల తేజో-జల భూ-మయమగు మృగ ఖగ నగ తరు కోటులలో 5సగుణములో 6విగుణములో సతతము సాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)
sri rama paadama
శ్రీ రామ పాదమా రాగం: అమృతవాహినీ తాళం: ఆది పల్లవి శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అనుపల్లవి వారిజ భవ సనక సనందన వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ) చరనం దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ శూర అహల్యను జూచి బ్రోచితివి ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)
bhajamyaham
శ్రీ గణనాథం భజామ్యహం రాగం: కనకాంగి (1 కనకాంగి మేళ) తాళం: ఆది పల్లవి శ్రీ గణ నాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థ ఫలదం అనుపల్లవి శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ) చరనం రంజిత నాటక రంగ తోషణం శింజిత వర మణి-మయ భూషణం 1ఆంజనేయావతారం 2సుభాషణం కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)
ganamurte sri krushnavenu
గానమూర్తే శ్రీకృష్ణవేణు రాగం: గానమూర్తి తాళం: ఆది పల్లవి గానమూర్తే శ్రీకృష్ణవేణు గానలోల త్రిభువనపాల పాహి (గా) అను పల్లవి మానినీమణి శ్రీ రుక్మిణి మానసాపహార మారజనక దివ్య (గా) చరణము(లు) నవనీతచోర నందసత్కిశోర నరమిత్రధీర నరసింహ శూర నవమేఘతేజ నగజాసహజ నరకాంతకాజ నరత్యాగరాజ (గా)
Nanu palima nadachi vachchitivo
నను పాలింప నడచి వచ్చితివో రాగం: మోహనం (28 హరికాంభోజి జన్య) తాళం: ఆది పల్లవి నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణ నాథ అనుపల్లవి వనజ నయన మోమును జూచుట జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను) చరణం సురపతి నీల మణి నిభ తనువుతో ఉరమున ముత్యపు సరుల చయముతో కరమున శర కోదండ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)
vandanamu raghunandana
వందనము రఘునందన రాగం: శహన రాగము తాళం: ఆది తాళము పల్లవి వందనము రఘునందన – సేతు బంధన భక్త చందన రామ చరణము(లు) శ్రీదమా నాతో వాదమా – నే భేదమా ఇది మోదమా రామ శ్రీరమా హృచ్చార మము బ్రోవ భారమా రాయబారమా రామ వింటిని నమ్ము కొంటిని శర ణంటిని రమ్మంటిని రామ ఓడను భక్తి వీడను నొరుల వేడను జూడను రామ కమ్మని విడె మిమ్మని వరము కొమ్మని పలుక రమ్మని రామ న్యాయమా …
Evarani nirnayinchirira
ఎవరని నిర్ణయించిరిరా రాగం: దేవామృతవర్షిణి తాళం: దేశాది పల్లవి ఎవరని నిర్ణయించిరిరా ని న్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥ అను పలవి శివుడనో మాధవుడనో కమల భవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥ చరణము(లు) శివమంత్రమునకు మా జీవము మా ధవమంత్రమునకు రాజీవము ఈ వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥ న్నెట్లారిధించిరిరా ॥
Nagumomu ganaleni
త్యాగరాజ కీర్తన నగుమోము గనలేని రాగం: ఆభేరి (మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ) ఆరోహణ: శ్ ఘ2 ం1 ఫ్ ణ2 శ్ అవరోహణ: శ్ ణ2 డ2 ఫ్ ం1 ఘ2 ఱ2 శ్ తాళం: ఆది రూపకర్త: త్యాగరాజ భాషా: తెలుగు పల్లవి నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ అనుపల్లవి నగరాజధర నీదు పరైవార లెల్ల ఒగిబోధన జేసే వారలు గారే యిటు లుండుదురె (నగుమోము) చరణం ఖగరాజు నీ యానతి విని వేగ …
Gandhamu puyaruga
త్యాగరాజ కీర్తన గంధము పూయరుగా రాగం: పున్నాగవరాళి తాళం: ఆది పల్లవి: గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అను పల్లవి: అందమయిన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ ॥గంధము॥ తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకలమను ముఖకళగని సొక్కుచు బలుకుల నమృతము లొలికెడు స్వామికి ॥గంధము॥ చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా మాలిమితో గోపాలబాలులతో నాల మేపిన విశాలనయనునికి ॥గంధము॥ హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా నారీమణులకు వారము యౌవన వారక యొసగెడు వారిజాక్షునికి …
keerthanas kana kana ruchira
త్యాగరాజ పంచరత్న కీర్తన కన కన రుచిరా కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: వరాళి తాళం: ఆది కన కన రుచిరా కనక వసన నిన్ను దిన దినమును అనుదిన దినమును మనసున చనువున నిన్ను కన కన రుచిర కనక వసన నిన్ను పాలుగారు మోమున శ్రీయపార మహిమ కనరు నిన్ను కన కన రుచిరా కనక వసన నిన్ను కళకళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను కన కన …