jaya lakshmi vara lakshmi

అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి రాగం: లలిత జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । ప్రియురాలవై హరికి~ం బెరసితివమ్మా ॥ పాలజలనిధిలోని పసనైనమీ~ంగడ మేలిమితామరలోని మించువాసన । నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా ॥ చందురుతోడ~ం బుట్టిన సంపదలమెఱు~ంగవో కందువ బ్రహ్మల~ం గాచేకల్పవల్లి । అందినగోవిందునికి అండనే తోడునీడవై వుందానవు మా​ఇంటనే వుండవమ్మా ॥ పదియారువన్నెలతో బంగారుపతిమ చెదరనివేదములచిగురు~ంబోడి । యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ॥