ikshvaku kula tilaka – రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ.. చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ 1 ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ॥ 2 ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా ఆ …
