తక్కువేమి మనకూ తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥ మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ మత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥ భూమిస్వర్గములు పొందుగ గొలచిన వామనుండు మనవాడై యుండగ ॥ 3 ॥ తక్కువేమి మనకూ ॥ దశగ్రీవుముని దండించిన ఆ ధశరధ రాముని దయ మనకుండగ ॥ 4 ॥ తక్కువేమి మనకూ ॥ …
