పాహి రామప్రభో రాగం: మధ్యమావతి తాళం: ఝంప పాహిరామప్రభో పాహిరామప్రభో పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ నామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీ తేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥ ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందారాకార ఆనంద రామప్రభో ॥ 3 ॥ పాహిరామప్రభో ॥ ఎందునేజూడ మీసుందరాననము కందునో కన్నులింపొంద రామప్రభో ॥ 4 ॥ పాహిరామప్రభో ॥ పుణ్యచారిత్రలావణ్య …
takkuvemi manaku
తక్కువేమి మనకూ తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥ మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ మత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥ భూమిస్వర్గములు పొందుగ గొలచిన వామనుండు మనవాడై యుండగ ॥ 3 ॥ తక్కువేమి మనకూ ॥ దశగ్రీవుముని దండించిన ఆ ధశరధ రాముని దయ మనకుండగ ॥ 4 ॥ తక్కువేమి మనకూ ॥ …
taraka mantramu
తారక మంత్రము రాగం: ధన్యాసి తాళం: ఆది తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥ మీరిన కాలుని దూతలపాలిటి మృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మంత్రము ॥ మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు ॥ 1 ॥ తారక మంత్రము ॥ ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న అన్ని …
adigo bhadradri
అదిగో భద్రాద్రి రాగం: వరాళి తాళం: ఆది అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ॥ అదిగో ॥ ముదముతో సీత ముదిత లక్ష్మణుడు కదసి కొలువగా కలడదె రఘుపతి ॥ 1 ॥ అదిగో ॥ చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై యుండెడి ॥ 2 ॥ అదిగో ॥ అనుపమానమై అతిసుందరమై తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి ॥ 3 ॥ అదిగో ॥ కలియుగమందున నిల వైకుంఠము నలరుచునున్నది …
Ramachandraya janaka mangalam
రామచంద్రాయ జనక (మంగళం) రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళమ్ ॥ కోసలేశాయ మందహాస దాసపోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥ చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2 ॥ లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సద్రుశ దేహాయ చారు మంగళమ్ ॥ 3 ॥ దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ చాప జాత గురు వరాయ భవ్య మంగళమ్ ॥ 4 ॥ …
pahi rama prabho
రామదాసు కీర్తన పాహి రామప్రభో పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో శ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభో ఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభో పుణ్యచారిత్రలావణ్య కారుణ్యగాంభీర్యదాక్షిణ్య శ్రీరామచంద్ర కందర్పజనకనాయందురంజలి సదానందుండు వై పూజలందు రామప్రభో ఇంపుగా జెవులకున్విందు గా నీకథల్ కందుగా మిమ్మి సొపొందరామప్రభో వందనము చేసిమునులందరు ఘనులై రివిందలై నట్టిగోవింద రామప్రభో బృందార కాదిబృందార్చిత పదారవిందముల నీసందర్శితానంద రామప్రభో తల్లివీనీవెమాతండ్రివినీవె మదాతవునీవు మాభ్రతరామప్రభో వల్లవాధరలైనగొల్ల భామలగూడి యుల్లమలరంగరంజిల్లి …
Dasarathi satakam
దాశరథీ శతకం శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥ రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో ద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 2 ॥ అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ విగత సమస్తదోష, పృథివీసురతోష, …
e teeruga nanu daya choochedavo
రామదాసు కీర్తన ఏ తీరుగ నను దయ చూచెదవో ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా …
paluke bangaaramaayena
రామదాసు కీర్తన పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ ఎంత వేడినగాని సుంతైన దయరాదు పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ రాతి నాతిగ చేసి భూతలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా కరుణించు భద్రాచల వరరామదాస పోష
ikshvaku kula tilaka
ikshvaku kula tilaka – రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ.. చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ 1 ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ॥ 2 ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా ఆ …