Sabarimala Pooja timings – నీర్ణీత పూజలు
పూజ | కాలం (ఐ. ఎస్.టి) |
పగలు | |
గర్భగుడి తెరిచే వేళ, నిర్మాల్యం, అభిషేకు | 3.00 AM |
గణపతి హోమం | 3.30 AM |
నెయ్యభిషేకం | 3.30 – 7.00 AM |
ఉషపూజ | 7.30 AM |
నెయ్యభిషేకం | 8.30 – 11.00 AM |
నియ్యభిషేకం/ నెయ్యితోనిలో ఉన్న నేతిలో | 11.10AM |
అభిషేకం (15) పూజా | 11.నుండి 11.30 ఉదయం |
ఉచ్చపూజ | 12.30 మధ్యహ్నం |
గర్భగుడి మూసేవేళ | 1.00 PM |
సాయంకాలం | |
గర్భగుడి తెరిచేవేళ | 3.00 PM |
దీపారధన | 6.30 PM |
పుష్పభిషేకం | 7 – 9.30 PM |
అతళపూజ | 9.30 PM |
హరివసనం – గర్భగుడిమూసేవేళ | 11.00 PM |
ప్రత్యేక పూజలు
నెయ్యభిషేకం :
అయ్యప్పస్వామికి చేసే పూజలలో అతిముఖ్యమైనది నెయ్యభిషేకం కొబ్బరి కాయలు నింపబడిన నేతితో చేసేదే ఈ పూజ. ఈ అభిషేకం ఉదయం 4 నుండి మిట్ట మధ్యాహ్నం 1 గంటదాకా జరుగుతుంది. అయ్యప్పస్వామిని, ఉపదేవతలను దర్శించుకొన్నాకా అయ్యప్ప భక్తులు గురుస్వామి సలహామేరకు ఒక ’విరి’ ఏర్పాటుచేసుకొంటారు. వాళ్ళు అందరి కొబ్బరి కాయలలోని నేతిని ఈ విరిలో సేకరిస్తారు.
భస్మకుళంలో (సన్నిధానం వెనకాల ఉన్న కొలను) స్నానం చేసిన తరువాత, గురుస్వామి అన్ని కొబ్బరికాయలను పగలగొట్టి నేతిని ఒక పాత్రలో నింపి శ్రీకోవేల లేదా గర్భగుడికి పంపిస్తారు.
నెయ్యభిషేకం తరువాత పూజారి కొంత నేతిని భక్తులకు తిరిగి ఇస్తారు. శ్రీకోవెల నుండి లభించిన నేతిని మహాప్రసాదంగా భావించి తీసుకొని వెళతారు. నేతి కొబ్బరికాయ తీసుకురాని భక్తులకోసం దేవోస్వం బోర్డు అథియ్య సిష్టం నెయ్యుకు ఏర్పాటు చేసింది.
నెయ్యి మానవ ఆత్మకు ప్రతీక. అయ్యప్పస్వామికి నెయ్యి అభిషేకించినప్పుడు స్వామిని చేరుతుంది. అంటే జీవాత్మనెయ్యి పరమాత్మ అయ్యప్పస్వామి.
ఒకసారి నెయ్యి ఖాళి అయిన కొబ్బరికాయ జడంతో అంటే మృతదేహంతో సమానం. అందువల్లే ఆ కొబ్బరికాయలను పెద్ద ’ఆళి’ అనే పెను మంటలో వేస్తారు.
పడి పూజ:
పడి పూజ 18 మెట్లకు చేసే పూజ. ’పదినెట్టాంపడి’ పూజ ఎంపిక చేయబడ్డ రోజులలో చేస్తారు. ఇది అయ్యప్పకు ’పుష్పాభిషేకం’ చేసిన తర్వాత చేస్తారు. ఈ పూజ సాయంత్రవేళల్లో తంత్రి, మేల్ శాంతి సమక్షంలో చేస్తారు. దాదాపు గంట జరిగే ఈ పూజలో ఆ పవిత్రమైన మెట్లను పట్టు బట్టలతోను, పూలతోను అలంకరించి, ప్రతి మెట్టు మీద దీపాన్ని వెలిగించి, చివరిగా ’ఆరతి’తో పూర్తిచేస్తారు.
’ఉదయాస్తమాన పూజ’:
ఉదయాస్తమాన అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా అని అర్థం. ఇది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా జరిగే పూజను సూచిస్తుంది. ( నిర్మాల్యం నుంచి అదళ పూజ దాకా) నిత్యపూజలతో పాటు విశేష పూజలు అభిషేకాలు కూడా నిర్వహిస్త్రారు, తద్వారా అయ్యప్ప స్వామి కరుణను, అనుగ్రహాన్ని భక్తులు పొందగలరని, భక్తుల కోర్కెలు ఈడేరుతాయని నమ్మకం. మొత్తం జరిగే 18 పూజలలో 15 మధ్యాహ్నం లోపే జరుగుతాయి. ఇవి కాక 45 కలశాభిషేకాలున్నాయి.
కలశాలు:
సహస్రకలసం
సహస్రకలశం అనేది హరిహర పుత్రునికి చేసే తాంత్రిక ఆగమ సేవలలో ఒకటి, దీని వల్ల దైవ అనుగ్రహం, మానవాళికి ఆనందం చేకూరుతాయి. ఇది దైవ అనుగ్రహాన్ని పొందే ప్రధాన మార్గం ప్రకృతిలో దొరికే ప్రతి గొప్ప సువాసనను, వెలకట్టలేని ద్రవ్యాలను, రత్నాలను, బంగారు, వెండి, రాగి మొదలైన లోహాలు, ఏడు సముద్రాలు పుణ్య నదులు నీరు కలశంలో నింపుతారు.
ఉల్సవబలి:
పాణి అనే వాయిద్యం మోతతో ఈ ఉల్సవబలి ప్రారంభమౌతుంది. ఉల్సవబలి భూతగణాలకు అర్పింపబడుతుంది. పాణి భూతగణాలను ఆహ్వానించడానికి మోగిస్తారు. వండిన పచ్చి బియ్యపు అన్నాన్ని చల్లుతారు. నాలంబాలుకు, బలికాల్ పరకు చుట్టూ ఉన్న స్థలంలో తంత్రి భూతగణ ప్రీతిగా ఇది చేస్తాడు. సప్తమాతృకలకు కూడా అన్నాన్ని చల్లిన తర్వాత ప్రధానాలయం తలుపులు తెరుస్తారు. అప్పుడు భక్తులు ఆ ఉల్సవబలి ఉత్సవంలో పాల్గొని దైవ దర్శనం చేసుకొంటారు.
పుష్పాభిషేకం :
శబరిమలలోని అయ్యప్ప స్వామికి పువ్వులతో పుష్పాభిషేకం చేస్తారు. పుష్పాభిషేకానికి పువ్వులు, ఆకులు (పత్రి) వాడతారు. ఎక్కువగా వాడేవి – తామర, చేమంతి, గన్నేరు, తులసి, మల్లెలు, బిల్వం. పుష్పాభిషేకం చేయాలనుకొనే భక్తులు ముందుగానే అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. పుష్పాభిషేకానికి రూ. 10,000/- ఖర్చు.
అబిషేకం :
శబరిమల అయ్యప్పకు చేసే సేవలలో అభిషేకం ప్రధానమైంది. శబరిమల అయ్యప్పకు అష్టాభిషేకం చేస్తాడు:
- విభూతి
- పాలు
- తేనె
- పంచామృతం
- లేత కొబ్బరికాయ నీళ్ళు
- చందనం
- పన్నీరు
- మంచినీరు
(అష్టాభిషేకం చేసే వస్తువులు ఒక్కోగుడిలో ఒక్కోలా మారవచ్చు).
కలశాభిషేకం : స్వామి విగ్రహానికి చైతన్యం చేకూర్చడానికి చేసే పూజలలో ప్రధానమైంది కలశాభిషేకం. మేల్ శాంతి ఆధ్వర్యంలో తంత్రి, కలశాభిషేకానికి ముందు నల్లంబలంలో కలభకలశ పూజ చేస్తారు.
కలభాభిషేకం చేయడానికి ముందు చందనాన్ని, ఆభరణ పెట్టి తో పాటు శ్రీకోవెల చుట్టూ ప్రదక్షిణంగా వచ్చిన తర్వాత, తంత్రి ఉచ్చపూజలో చివరగా కలభాభిషేకం చేస్తారు. అంటే, చందనాభిషేకంతో అయ్యప్పకు ఆ పూజలు పూర్తవుతాయి.
లక్షార్చన :
లక్షార్చన అంటే లక్షసార్లు స్వామి పేరు చెప్తూ చేసే అర్చన. అయ్యప్ప నామమంత్రాన్ని ఒక గుంపుగా చేరి పునః పునః ఉచ్చరించడం. తర్వాత, మేల్ శాంతి సహాయంతో తంత్రి, మరి కొందరు పూజారులతో కలిసి, సన్నిధానంలో లక్షార్చన చేస్తారు. లక్షార్చనకు ముందు అభిషేకానికి, బ్రహ్మకలశాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణగా తీసుకొని వెళ్ళి, తర్వాత ’ఉచ్చపూజ’ చేస్తారు.