అన్నమయ్య కీర్తన మంగాంబుధి హనుమంతా రాగం: ధర్మవతి, తాళం: ఆది మంగాంబుధి హనుమంతా నీ శరణ । మంగవించితిమి హనుమంతా ॥ బాలార్క బింబము ఫలమని ప ట్టిన ఆలరి చేతల హనుమంతా । తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనినా హనుమంతా ॥ జలధి దాట నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంతా । ఇలయు నాకసము నేకముగా, నటు బలిమి పెరిగితివి భళి హనుమంతా ॥ పాతాళము లోపలి మైరావణు ఆతల జంపిన …
