ఎవరని నిర్ణయించిరిరా రాగం: దేవామృతవర్షిణి తాళం: దేశాది పల్లవి ఎవరని నిర్ణయించిరిరా ని న్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥ అను పలవి శివుడనో మాధవుడనో కమల భవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥ చరణము(లు) శివమంత్రమునకు మా జీవము మా ధవమంత్రమునకు రాజీవము ఈ వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥ న్నెట్లారిధించిరిరా ॥
