e puraanamula nenta vedikinaa

అన్నమయ్య కీర్తన ఏ పురాణముల నెంత వెదికినా ఏపురాణముల నెంత వెదికినా । శ్రీపతిదాసులు చెడ రెన్నడును ॥ వారివిరహితములు అవి గొన్నాళ్ళకు । విరసంబులు మరి విఫలములు । నరహరి గొలి చిటు నమ్మినవరములు । నిరతము లెన్నడు నెలవులు చెడవు ॥ కమలాక్షుని మతిగాననిచదువులు । కుమతంబులు బహుకుపథములు । జమళి నచ్యుతుని సమారాధనలు । విమలములే కాని వితథముగావు ॥ శ్రీవల్లభుగతి జేరనిపదవులు । దావతులు కపటధర్మములు । శ్రీవేంకటపతి సేవించునేవలు । …