deva devam bhaje

అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే రాగం: ధన్నాసి దేవ దేవం భజే దివ్యప్రభావమ్ । రావణాసురవైరి రణపుంగవమ్ ॥ రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయమ్ । రాజారి కోదండ రాజ దీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రమ్ ॥ నీలజీమూత సన్నిభశరీరం ఘనవి- శాలవక్షం విమల జలజనాభమ్ । తాలాహినగహరం ధర్మసంస్థాపనం భూలలనాధిపం భోగిశయనమ్ ॥ పంకజాసనవినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనమ్ । లంకా విశోషణం లాలితవిభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతమ్ ॥