స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే | న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || 11 ||
ఇతి శ్రీ సూర్యాష్టకమ్ ||
సూర్య అష్టకం సూర్య భగవానునికి అంకితం చేయబడిన వేద గ్రంథమైన సాంబ పురాణం లోనిది. ఇది సూర్యుడు యొక్క విభిన్న లక్షణాలను ప్రశంసిస్తూ 8 శ్లోకాలను కలిగి ఉంటుంది. రోజూ ఈ స్తోత్రం జపించడం ద్వారా ఏదైనా గ్రహ పీడ లేదా ఇతర గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలను తొలగించుకోవచ్చు, పేదలు ధనవంతులు కావచ్చు, పిల్లలు లేనివారు సంతానం పొందవచ్చు అని స్తోత్రంలోని ఫలశృతి భాగంలో చెప్పబడింది. అంతే కాక, సూర్యుడికి అంకితం చేసిన రోజున, స్త్రీలు, జిడ్డుగల ఆహారం, మద్యం మరియు మాంసాన్ని తాకని వారిని అనారోగ్యం, దుఖం లేదా పేదరికం తాకకుండును, మరియు చివరకు సూర్యలోక ప్రాప్తి కలుగును.