Sandhya vandanam – సంధ్యావందన మూల ప్రక్రియ

సంధ్యావందన శ్లోకాలు చాలామటుకూ బుగ్వేదం. మరియు తైత్తిరీయ అరణ్యకాలనుంచి సేకరించి క్రోడికీకరించబడినాయి. అవన్నీ ఒక క్రమంలో అమర్చబడినాయి. సంధ్యావందన శ్లోక సంకలనకారుడెవరో తెలియదు. ఆ అజ్ఞాత మహానుభావుడి చరణాలకు నమస్కరించి సంధ్యావందన శ్లోకాల మూలం వాటి అర్థ తాత్పర్యములు తెలుసుకోవాలని ఈ ప్రయత్నం చేయుచున్నాను. కొన్నిశ్లోకాల మూలం నాకగవతం కాలేదు. నిష్టాతులైన బుధజనులు నా ఈసాహసమును మన్నించి ఏవైనా లోపాలు, సంస్కృత శ్లోకాల అనువాదంలో తప్పులేవైనా ఉంటే పెద్ద మనుసుతో క్షమించి తెలియచేసిన సరిదిద్దుకోగలను.
తెలుసుకొనవలసినవి
1. శ్రీ కృష్ణ పండితులవారు తాము వ్రాసిన సంధ్యాభాష్యంలో అర్హ్యప్రదానం, గాయత్రీజపం. ఉపస్థానం, : ఈ మూడింటిని సంధ్యావందన ప్రక్రియలో అతిముఖ్య మైన అంగాలుగా . పేర్కొన్నారు. మిగిలినవన్నీ అనుబంధక్రియలే. అతిముఖ్యమైన మూడంగాలలో అర్హ్య(ప్రదానం మరింత ప్రధానమైనది మరియు అత్యావశ్యకమైనది. తప్పనిసరిగా చేయవలసినది.
2. ప్రాచీన కాలంలో నది, సెలయేరు లేదా జలాశయాలలో మోకాలిలోతులో నిల్చుని సంధ్యావందనం చేసేవారు. అర్హ్యప్రదానం, గాయత్రీజపం, ఉపస్థానం కావించుకునేవారు. ఈరోజుల్లో ఇంటిలోనే సంధ్యావందనం చేసుకుంటూ ఉండటం వలన సంధ్యావందన క్రియలో అనుగుణంగా మార్పులు జరిగాయి. పద్మానసమేసుకునే పూర్తి క్రియ కానిస్తున్నారు. అదనంగా చాలా అనగా గాయత్రీ ముద్రలు, అంగన్యాస, కరన్యాసములు, తర్పణ కార్యక్రమం సంధ్యావందనంతో కలిపేసుకున్నారు.
3. వేదకాలంలో ప్రకృతి, పంచభూతాలు (భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం), సూర్య చంద్రులు కనుపించు దైవాలుగా (దైవశక్తులు) పరిగణించబడినాయి. సంధ్యావందనంలో సహజంగా వీటి పూజలే చూస్తాము. కాలక్రమేణా, వీటన్నిటికీ మూలమైన పరమాత్మను ఆరాధిస్తున్నాము.
4. బుగ్వేదము రెండు సంకలనములుగా లభ్యమౌతుంది. ఒక సంకలనములో బుగ్వేదం 8 అష్టకాలుగా విభజింపబడినది. ప్రతి అష్టకంలో అధ్యాయాలు, ప్రతి ఆధ్యాయంలో వర్గాలు, ప్రతి వర్గంలో మంత్రాలు ఉంటాయి. రెండవ సంకలనంలో బుగ్వేదం 10 మండలాలుగా విభజింపడినది. ప్రతి మండలంలో అనువాకాలు, ప్రతి అనువాకంలో సూక్తులు, ప్రతి సూక్తంలో మంత్రాలు ఉంటాయి… రెండు సంకలనాలలోకూడా ఒకే మంత్రములు మొత్తం 10,552 ఉన్నాయి.
Read more