Nagaja Kumara Neerajanam Song – నగజా కుమారా గజరాజ నీరాజనం
నగజా కుమారా గజరాజ ముఖనీకు నిగనిగల కర్పూర నీరాజనం
నగజా కుమార ఓ గజరాజ ముఖ నీకు నిగనిగల కర్పూర నీరాజనం
నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం (2)
|| నగజా ||
నీపాదముల వ్రాలు దేవ కోటి కిరీట దివ్యమణికాంతులే నీరాజనం (2)
ఓ మహాకాయ నీముందు మిణుగురులైన తారకా గ్రహ పతులే నీరాజనం (2)
నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం (2)
|| నగజా ||
బాల సూర్యుని రీతి భాసించు నీరూపు తిలకించు చూపులే నీరాజనం (2)
నీ కృపను వెలుగు ఈ గీతికా జ్యోతులే నిలువెల్ల నినుచూపు నీరాజనం (2)
నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం (2)
|| నగజా ||
కాణిపాకా వాసా కల్యాణ గుణమయా వాణి ప్రదా నీకు నీరాజనం (2)
పాణి తలపున పరశు పాషాదులను దాల్చు ప్రణతార్తి సంహార నీరాజనం (2)