అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి
రాగం: ఆభోగి (22 ఖరహరప్రియ జన్య)
ఆ: స రి2 గ2 మ1 ద2 స
అవ: స ద2 మ1 గ2 రి2 స
తాళం: ఆది
పల్లవి
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ॥ (2.5)
చరణం 1
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి । (3.5)
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన ॥ (2.5)
మనుజుడై పుట్టి మనుజుని సేవించి (ప.)
అనుదినమును దుఃఖమందనేలా (ప.)
చరణం 2
అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై ।
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన ॥
మనుజుడై పుట్టి మనుజుని సేవించి (ప.)
అనుదినమును దుఃఖమందనేలా (ప.)