If It Is Submitted! Ashtaishwaryas Are Created In Your House By The Grace Of Goddess – ఇది సమర్పిస్తే! అమ్మవారి కృపతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇది సమర్పిస్తే!
అమ్మవారి కృపతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి…….!!

శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆవిడ ఈ కలియుగానికి మూల స్తంభం అయితే శ్రీమహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి.అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయకం.

అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియామాలు పాటిస్తాము. అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది తెలుసుకోబోతున్నాం..

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి.అలాగే వివిధరకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి.
లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి.

పూజ అంతా అయ్యాక ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం,అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం చాలా ప్రీతికరం,

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకురసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలాగా చెయ్యడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్తితికి వెళ్తారు.

అలాగే నైవేద్యం పెట్టిన చెరుకురసం మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలాగా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దరిద్రం మొత్తం పోతాయి.