Benefits of lighting silver lamp

silver lamp e1695127270153
image_print

Benefits of lighting silver lamp – వెండి దీపాలు ఏఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే. ప్రతి ఇంట్లో రోజూ దీపం చేస్తాo

ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం భారతీయుల సంప్రదాయం. ఏ పండుగ వచ్చినా.. ఏ శుభకార్యం జరిగినా.. దేవాలయానికి వెళ్లి దీపం పెట్టడం కూడా.. ఒక సంప్రదాయం ఉంది. అలాగే కార్తీక మాసం, మాఘమాసాలలో కూడా ఎక్కువగా దీపారాధనకు ప్రాధాన్యత ఇస్తారు. శివుడికి ఎక్కువగా దీపారాధన చేయడం ఆనవాయితీగా మారింది.

రోజూ దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి.. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఈ ఆర్టికల్ ద్వారా నివృత్తి చేసుకుందాం.

* దీపం ఎప్పుడు చేయాలి ? ఎలా చేయాలి ?

పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు.

తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

రాతి యుగం నుండి రాతిలో వెలిగించు,లోహతో వెలిగించు దీపాల వరకు, దీపాల అకృతులకును, వాటిని తయ్యారు చెయ్యటానికి వాడే వస్తువునకు కుడా ఎంతో ప్రాముఖ్యత మరియు చరిత్ర ఉంది. అందులో కళాత్మకతో ఒక క్రమ వికాసం కనిపిస్తుంది.

రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.అలాగే రకరకాల గుళ్ళల్లలోనూ కూడ దీపారాధన కు ఉపయోగించేవారు. ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి వచ్చేను. మనుషులలో ఆర్ధిక,సామాజికంగా వచ్చిన మార్పుల బట్టి దీపాకృతుల్లోను వాటి పరిమాణంలోను కళత్మకతలోను మార్పులు వచ్చేసాయి. ఉదాహరణకు ఆర్ధికంగా ఉన్నవారు స్వర్ణదీపాలు, నవరత్నములు పొదిగిన దీపాల సెమ్మెలు వాడుకలో ఉన్నట్లు, మన ప్రాచీన ఇతిహాసాలలోను కావ్యాలలో ప్రస్తావనలున్నాయి.

మరి వెండి దీపాలు ఏదేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం…

వెండి దీపాలలో నెయ్యి వేసి గణపతి ముందు వెలిగిస్తే ఇష్టకార్య సిద్ది కలుగుతుంది. మీరు ఏ కోరిక కోరుకున్న తీరుతాయి.

వెండి దీపాలు, సరస్వతి దేవి ముందు వెలిగిస్తే , మనలోని అజ్ఝానం పోయి సుజ్ఝానం వస్తుంది. సరస్వతి దేవి కటాక్షం కలుగుతుంది.

వెండి దీపాలు మహాలక్ష్మి దేవి ముందు వెలిగిస్తే దారిద్ర్యం పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

వెండి దీపాలు సూర్యునిముందు తెల్లవారుజామున , (తెల్లవారక ముందు)వెండి దీపాలు వెలిగిస్తే స్వామి నువ్వు జగత్ రక్షకుడవు అని దీపాలు చూపించాలి. అలానే సాయంత్రం అనగా సంధ్యా సమయంలో అనగా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వెలుగును ఇచ్చావు, ఇప్పుడు నీకు వెలుగు ను చూపిస్తున్నామని చెప్పాలి, ఇలా చేస్తే పేదరికం పోయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. శత్రువులు దూరమై ముఖంలో కళ వస్తుంది.

చంద్రుని ఎదుట వెండి దీపాలు వెలిగిస్తే ముఖంలో కాంతి వచ్చి, తేజోవంతులుగా మారుతారు. మనసు స్థిరత్వం ఉంటుంది. చంచల దోషం పోతుంది.

కుజగ్రహం(అంగారక గ్రహం) ముందు నెలలో ఒక మంగళవారం వెండి దీపం వెలిగించడం వల్ల లోలోలపల గొడవలు ఉంటే అవి పోతాయి. బిపి కంట్రోల్ అవుతుంది.

నవగ్రహాల్లో బుధగ్రహం దగ్గర ఒక బుధవారం వెండి దీపం వెలిగించడం వల్ల సత్ బుద్ది కలుగుతుంది.

నవగ్రహాలలో బుధగ్రహం వద్ద ఒక గురువారం వెండి దీపాలు వెలిగించడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి.

నవగ్రహాలలో ఒక శుక్రగ్రహం వద్ద ఒక శుక్రవారం నాడు వెండి దీపం వెలిగించడం వల్ల షుగర్ వ్యాధి నివారణ అవుతుంది.

నవగ్రహాలలో శనిగ్రహం దగ్గర ఒక శనివారం వెండి దీపం వెలిగించడం వల్ల గుప్తరోగాలు నివారణ అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *