అన్నమయ్య కీర్తన కొలిచిన వారల కొలిచిన వారల కొంగుపైడితడు । బలిమి తారక బ్రహ్మమీతడు ॥ ఇనవంశాంబుధి నెగసిన తేజము । ఘనయజ్ఞంబుల గల ఫలము । మనుజరూపమున మనియెడి బ్రహ్మము । నినువుల రఘుకుల నిధానమీతడు ॥ పరమాన్నములోపలి సారపుజవి । పరగినదివిజుల భయహరము । మరిగినసీతా మంగళసూత్రము । ధరలో రామావతారంబితడు ॥ చకితదానవుల సంహారచక్రము । సకల వనచరుల జయకరము । వికసితమగు శ్రీవేంకట నిలయము । ప్రకటిత దశరథ భాగ్యంబితడు ॥
kolani dopariki
అన్నమయ్య కీర్తన కొలని దోపరికి కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు । కుల స్వామికిని గొబ్బిళ్ళో ॥ కొండ గొడుగుగా గోవుల గాచిన । కొండొక శిశువునకు గొబ్బిళ్ళో । దండగంపు దైత్యుల కెల్లను తల । గుండు గండనికి గొబ్బిళ్ళో ॥ పాప విధుల శిశుపాలుని తిట్టుల । కోపగానికిని గొబ్బిళ్ళో । యేపున కంసుని యిడుమల బెట్టిన । గోప బాలునికి గొబ్బిళ్ళో ॥ దండివైరులను తరిమిన దనుజుల । గుండె దిగులునకు గొబ్బిళ్ళో …
kodekaade veede
అన్నమయ్య కీర్తన కోడెకాడె వీడె కోడెకాడె వీడె వీడె గోవిందుడు కూడె ఇద్దరు సతుల గోవిందుడు ॥ గొల్లెతల వలపించె గోవిందుడు కొల్లలాడె వెన్నలు గోవిందుడు । గుల్ల సంకు~ంజక్రముల గోవిందుడు గొల్లవారింట పెరిగె గోవిందుడు ॥ కోలచే పసులగాచె గోవిందుడు కూలగుమ్మె కంసుని గోవిందుడు । గోలయై వేల కొండెత్తె గోవిందుడు గూళెపుసతుల~ం దెచ్చె గోవిందుడు ॥ కుందనపు చేలతోడి గోవిందుడు గొందులు సందులు దూరె గోవిందుడు । కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు గొంది~ం దోసె …
kim karishyaami
అన్నమయ్య కీర్తన కిం కరిష్యామి కిం కరిష్యామి కిం కరోమి బహుళ- శంకాసమాధానజాడ్యం వహామి ॥ నారాయాణం జగన్నాథం త్రిలోకైక- పారాయణం భక్తపావనమ్ । దూరీకరోమ్యహం దురితదూరేణ సం- సారసాగరమగ్నచంచలత్వేన ॥ తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- । వరదం శరణాగతవత్సలమ్ । పరమపురుషం కృపాభరణం న భజామి మరణభవదేహాభిమానం వహామి॥
kanti sukravaaramu
అన్నమయ్య కీర్తన కంటి శుక్రవారము కంటి శుక్రవారము గడియ లేడింట । అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥ సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి । కమ్మని కదంబము కప్పు కన్నీరు । చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి । తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ॥ పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి । తెచ్చి శిరసాదిగ దిగనలది । అచ్చెరపడి చూడనందరి కనులకింపై । నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ॥ తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు । …
kanti nakhilaanda
అన్నమయ్య కీర్తన కంటి నఖిలాండ కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి । కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ॥ మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి । బహు విభవముల మంటపములు గంటి । సహజ నవరత్న కాంచన వేదికలు గంటి । రహి వహించిన గోపురములవె కంటి ॥ పావనంబైన పాపవినాశము గంటి । కైవశంబగు గగన గంగ గంటి । దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి । కోవిదులు గొనియాడు కోనేరి గంటి …
kaligenide naaku
అన్నమయ్య కీర్తన కలిగెనిదె నాకు కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది ॥ జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి । దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే ॥ శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీజనార్ధన । పరమ మెఱంగను భక్తి యెఱంగను నిరతము నాగతి నీదాస్యమే ॥ నమో నారాయణా నమో లక్ష్మీపతి నమో పుండరీకనయనా । అమిత శ్రీవేంకటాధిప యిదె నా క్రమమెల్లను నీకయింకర్యమే …
jaya lakshmi vara lakshmi
అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి రాగం: లలిత జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । ప్రియురాలవై హరికి~ం బెరసితివమ్మా ॥ పాలజలనిధిలోని పసనైనమీ~ంగడ మేలిమితామరలోని మించువాసన । నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా ॥ చందురుతోడ~ం బుట్టిన సంపదలమెఱు~ంగవో కందువ బ్రహ్మల~ం గాచేకల్పవల్లి । అందినగోవిందునికి అండనే తోడునీడవై వుందానవు మాఇంటనే వుండవమ్మా ॥ పదియారువన్నెలతో బంగారుపతిమ చెదరనివేదములచిగురు~ంబోడి । యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ॥
jaya jaya rama
అన్నమయ్య కీర్తన జయ జయ రామా జయ జయ రామా సమరవిజయ రామా । భయహర నిజభక్తపారీణ రామా ॥ జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా । అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా ॥ అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా । ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా ॥ అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా । వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా ॥
itti muddulaadu
అన్నమయ్య కీర్తన ఇట్టి ముద్దులాడు రాగం: దేవగాంధారి ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ॥ గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి । చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ॥ ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి తచ్చెడి పెరుగులోన దగబెట్టి । నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార వొచ్చెలి …
