daachuko nee paadaalaku

అన్నమయ్య కీర్తన దాచుకో నీ పాదాలకు రాగం: ఆరభి దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి । పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ॥ వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ । తక్కినవి భాండారాన దాచి వుండనీ । వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము । దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా ॥ నానాలికపైనుండి నానాసంకీర్తనలు । పూని నాచే నిన్ను బొగడించితివి । వేనామాల వెన్నుడా …

choodaramma satulaaraa

అన్నమయ్య కీర్తన చూడరమ్మ సతులారా చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ । కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ॥ శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు । కాముని తల్లియట చక్కదనాలకే మరుదు । సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు । కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ॥ కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు । తలపలోక మాతయట దయ మరి ఏమరుదు । జలజనివాసినియట చల్లదనమేమరుదు । కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ॥ అమరవందితయట …

cheri yasodaku

అన్నమయ్య కీర్తన చేరి యశోదకు చేరి యశోదకు శిశు వితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ॥ సొలసి చూచినను సూర్యచంద్రులను లలి వెదచల్లెడులక్షణుడు । నిలిచిననిలువున నిఖిలదేవతల కలిగించు సురలగనివో యితడు ॥ మాటలాడినను మరియజాండములు కోటులు వోడమేటిగుణరాశి । నీటగునూర్పుల నిఖిలవేదములు చాటువనూ రేటిసముద్ర మితడు ॥ ముంగిట జొలసిన మోహన మాత్మల బొంగించేఘనపురుషుడు । సంగతి మావంటిశరణాగతులకు నంగము శ్రీవేంకటాధిపు డితడు ॥

chakkani talliki

అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి రాగం: పాడి చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా ॥ కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుభళా । పలుకుల సొంపుల బతితో గసరెడి చలముల యలుకకు చాంగుభళా ॥ కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా । ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా ॥ జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుభళా । …

chaduvulone harina

అన్నమయ్య కీర్తన చదువులోనే హరిన చదువులోనే హరిని జట్టిగొనవలెగాక । మదముగప్పినమీద మగుడ నది గలదా ॥ జడమతికి సహజమే సంసారయాతన యిది । కడు నిందులో బరము గడియించవలెగాక । తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను । విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ॥ భవబంధునకు విధిపాపపుణ్యపులంకె । తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక । అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే । నివిరి నిన్నటివునికి నేటికి గలదా ॥ దేహధారికి గలదే తెగనియింద్రియబాధ …

chaaladaa hari naama

అన్నమయ్య కీర్తన చాలదా హరి నామ రాగము : హంసధ్వని చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ ఇది యొకటి హరి నామ మింతైన జాలదా । చెదరకీ జన్మముల చెరలు విడిపించ । మదినొకటె హరినామ మంత్రమది చాలదా । పదివేల నరక కూపముల వెడలించ ॥ కలదొకటి హరినామ కనకాద్రి చాలదా । తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ । తెలివొకటి హరినామదీప మది చాలదా । …

chaaladaa brahmamidi

అన్నమయ్య కీర్తన చాలదా బ్రహ్మమిది చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు । జాలెల్ల నడగించు సంకీర్తనమ్ ॥ సంతోష కరమైన సంకీర్తనమ్ । సంతాప మణగించు సంకీర్తనమ్ । జంతువుల రక్షించు సంకీర్తనమ్ । సంతతము దలచుడీ సంకీర్తనమ్ ॥ సామజము గాంచినది సంకీర్తనమ్ । సామమున కెక్కుడీ సంకీర్తనమ్ । సామీప్య మిందరికి సంకీర్తనమ్ । సామాన్యమా విష్ణు సంకీర్తనమ్ ॥ జముబారి విడిపించు సంకీర్తనమ్ । సమ బుద్ధి వొడమించు సంకీర్తనమ్ । జమళి …

bhaavamu lona

అన్నమయ్య కీర్తన భావము లోన రాగం: దేసాక్షి భావములోనా బాహ్యమునందును । గోవింద గోవిందయని కొలువవో మనసా ॥ హరి యవతారములే యఖిల దేవతలు హరి లోనివే బ్రహ్మాండంబులు । హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి యనవో మనసా ॥ విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు । విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా ॥ అచ్యుతుడితడే ఆదియు నంత్యము అచ్యుతుడే యసురాంతకుడు । అచ్యుతుడు …

ati dushtuda ne nalusudanu

అన్నమయ్య కీర్తన అతి దుష్టుడ నే నలుసుడను అతిదుష్టుడ నే నలసుడను । యితరవివేకం బికనేల ॥ ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ నిక్కపుదప్పులు నేరములు । గక్కన నిన్నిట కలిగిననీవే దిక్కుగాక మరి దిక్కేది ॥ ఘోరపుబాపము కోట్లసంఖ్యలు చేరువ నివె నాచేసినివి । నీరసునకు నిటు నీకృప నాకిక కూరిమి నా యెడ గుణమేది ॥ యెఱిగి చేసినది యెఱుగక చేసిన- కొఱతలు నాయెడ గోటులివే । వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు మఱవక …

antaryami alasiti

అన్నమయ్య కీర్తన అంతర్యామి అలసితి రాగం: శివ రంజని అంతర్యామి అలసితి సొలసితి । ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ కోరిన కోర్కులు కోయని కట్లు । తీరవు నీవవి తెంచక । భారపు బగ్గాలు పాప పుణ్యములు । నేరుపుల బోనీవు నీవు వద్దనక ॥ జనుల సంగముల జక్క రోగములు । విను విడువవు నీవు విడిపించక । వినయపు దైన్యము విడువని కర్మము । చనదది నీవిటు శాంతపరచక ॥ మదిలో …