Akkalkot Maharaj Charitra

మహారాష్ట్ర దేశంలోని అక్కల్కోట గ్రామంలో ఎక్కువ కాలం పెంచి ఆ ఊరిని గొప్పక్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ ఆక్కల్కోట మహారాజ్, ఆయన కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని నాల్గవ అవతారం. ఆనాటి మహాత్ములెందరో ఆయనను శ్రీదత్తమూర్తి అవతారంగా గుర్తించారు. ఈనాటికీ భక్తులకు ప్రత్యక్ష నిదర్శనం చూపించే శ్రీ దత్తమూర్తి పాదుకలు-గాణ్గాపూర్ లోనివి – చాలామంది భక్తులకు శ్రీ అక్కల్ కోట మహారాజ్ దత్తమూర్తి అవతారమని నిదర్శనం యిచ్చాయి. ఉదాహరణకు బాలోజరాజా గాణాపురం లో నిష్టగా గురుచరిత్ర పారాయణ చేస్తుండగా ఒకరాత్రి స్వప్నంలో శ్రీదత్త మూర్తి కనిపించి, “నేను మీ సంస్థానంలోనే వుండగా నీవిక్కడకు రావలసిన అవసరమేమి?” అని అడిగి అంతర్జానమయ్యారు
అశ్వనిమాసం 1856 (శక సంవత్సరం 1779)లో పంచమి బుధవారం నాడు శ్రీ అక్కల్కిటస్వామి మొదటిసారిగా అక్కల్కోట గ్రామంలో కనిపిం చారు. అప్పటినుంచి సుమారు ఇరువది సంవత్సరాలు అక్కడే ఉన్నారు. వీరి అసలు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు మొదలైన వివరాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎవరికీ ఎప్పుడూ ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు. అరుదుగా అప్పుడప్పుడూ ఆయన చెప్పిన వివరాలు వున్నా కూడా అవి అన్నీ ఒకరీతిగా లేవు ఒకప్పుడు చింతోపంత్ ఆయనను ఈ వివరాలు అడిగారు. దానికి స్వామి యిలా చెప్పారు. “నా తల్లిదండ్రులు మాదిగవారు. వృత్తి తోళ్ళపని”. మరొకసారి ఒక భక్తునితో, “మేమొక కదలీవనం నుండి వచ్చాము” అన్నారు. కార్వే అను భక్తునితో, “నేను యజుర్వేద బ్రాహ్మణుడను. కాశ్యపగోత్రం. పేరు నరసింహభాన్, మీనరాశి, మళ్లీ అడిగితే చెప్పు తీసుక్కొడతా” అన్నారు. మరొక భక్తుడు అడిగినపుడు పొడి మాటలతో ఇలా అన్నారు: ‘మూలపురుషుడు, వటనృక్లం- మూలం-మూలానికి మూలం“