ఈ విధంగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితమట!

Navagraha e1696334713723
image_print

ఈ విధంగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితమట!

జన్మ రాశుల్లోని గ్రహ సంచారం వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు నవగ్రహ ప్రదక్షిణ సులభమైన ప్రక్రియగా ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. ఈ ప్రదక్షిణ వల్ల లభించే దైవికశక్తి సమస్యల నుంచి మనిషిని రక్షిస్తుందట. ఓ నిర్దిష్టమైన పద్ధతిలో నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేషఫలితం ఉంటుందట. చాలామంది ప్రదక్షిణలు చేసేటప్పుడు నవగ్రహాలను తాకుతూ నమస్కారం చేస్తారు….అయితే వీటిని తాకకుండా ప్రదక్షిణ చేయాలట.
నవగ్రహాల మధ్యన దినకరుడైన సూర్యుడు తూర్పు ముఖంగా ఉంటాడు. సూర్యునికి ముందు శుక్రుడు కూడా తూర్పాభిముఖంగానే ఉంటాడు. సూర్యుడికి కుడి పక్కన కుజుడు దక్షిణాబిముఖంగా ఉంటాడు. శుక్రుడికి కుడివైపున పశ్చిమాభిముఖంగా చంద్రుడు, ఎడమవైపున ఉత్తరాభిముఖంగా బుధుడు ఉంటారు. సూర్యుడికి వెనుకవైపు శనీశ్వరుడు పశ్చిమాభిముఖంగా వుంటాడు. శని దేవుడికి ఎడమ పక్కన రాహువు ఉత్తరాభిముఖంగానూ, కుడివైపున కేతువు దక్షిణాభిముఖంగానూ, ఎదురెదురుగా ఉంటారు.
కాబట్టి సూర్యుని చూస్తూ నవగ్రహ మండపం లోనికి ప్రవేశించి ఎడమ వైపు నుంచి అంటే చంద్రునివైపు నుంచి కుడివైపు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం శ్రేష్టమట. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కుడి వైపు నుంచి ఎడమవైపునకు (అంటే బుధుడి వైపు నుంచి) రాహు, కేతువులనూ స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చట. చివరన వరుసగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువులను స్మరిస్తూ ఒక్కో ప్రదక్షిణచేసి నవగ్రహాలకు వెన్ను చూపకుండా బయటకు రావాలి. గ్రహదోషాల నుంచి పరిహారానికి నవగ్రహ ప్రదక్షిణ కంటే ఉత్తమమైన మార్గం లేదనేది ఆధ్యాత్మికవేత్తల సూచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *