Vedamule Nee Nivasamata

Narasimha e1696146107136
image_print

Vedamule Nee Nivasamata Lyrics in Telugu – వేదములే నీ నివాసమట విమల నారసింహా

వేదములే నీ నివాసమట విమలనారసింహా |
నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహా ||
ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన |
నారాయణ రమాధినాయక నగధర నరసింహా |
నీరూపంబు ఇంతఅంతయని నిజము తెలియరాదు |
ఈరీతి త్రివిక్రమాకృతి యేచితి నరసింహా ||
గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ |
శ్రీవల్లభ పురాణపురుష శిఖనఖ నరసింహా |
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు |
భావింపగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహా ||
దాసపరికర సులభ తపన చంద్రనేత్ర |
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహా |
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయని దైవమవటుగాన |
ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహా ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *