Sarpa Suktam in Telugu – సర్ప సూక్తం
నమో అస్తు సర్పేభ్యోయే కేచ పృథివీమను |
మీ అత్తరిక్షే యే దివి తేభ్యః సర్వేభ్యో నమః ॥ 1 ॥
భావము – సర్పములకు నమస్కారము. ఈ పృథివియందు అంతరిక్షమునందు, స్వర్గమునందు ఏ సర్పములైతే కలవో వాటికి నమస్కారము.
యేsధో రోచనే దివో యేవా సూర్యస్య రష్మిషు |
యేషామప్సు సదః కృతం తేభ్యః సర్వేభ్యో నమః ॥ 2 ॥
భావము – అధోలోకములందు, స్వర్గమునందు, సూర్య కిరణములందు, నీటియందు నివాసమును కల్పించుకున్న ఏ సర్పములైతే ఉన్నాయో, వాటికి నమస్కారము.
యా ఇషవో యాతుధానానాం యేవా వనస్పతీగ్ం రను |
యే వాsవటేషు శేరతే తేభ్యః సర్వేభ్యో నమః ॥ 3 ॥
భావము – అసురుల చేత అస్త్రములుగా ప్రయోగింపబడునవి, వృక్ష సమూహాలలో నివసించునవి, నీటి బావులలో నిద్రించునవి అయిన ఏ సర్పములైతే ఉన్నాయో వాటికి నమస్కారము.
ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టమ్ |
ఆశ్రేషా యేషామను యన్తి చేతః ।
యే అంతరిక్షం పృధివీం క్షియన్తి |
తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః |
యే రోచనే సూర్యస్వాపి సర్పాః |
యేదివం దేవీమనుసన్చరన్తి |
యేషామాశ్రేషా అనుయన్తి కామమ్ | తేభ్యస్వర్పేభ్యో మధుమజ్జుహోమి ॥ 4 ॥
భావము – ఈ సర్పములకు ప్రీతికరమైన హవిస్సు అందునుగాక. ఆశ్రేషా నక్షత్రమును ఆశ్రయించిన మరియు సూర్యుని అధీనంలోని సర్పములు, స్వర్గలోక స్త్రీలను/దేవతలను అనుసరించునవి. ఆశ్రేషానక్షత్రముకు ఇష్టమైనది కలిగించునవి అయిన ఆ సర్పములు మా బుద్ధులను పాలించునుగాక / రక్షించును గాక. ఆ సర్పములకు మధువును (తేనెను) సమర్పించి హోమము చేయుచున్నాను.
నిఘృష్వెరసమాయుతైః |
కాలైర్హరిత్వమాపన్నైః |
ఇంద్రాయాహి సహస్రయుక్ |
అగ్నిర్విభ్రాష్టివసనః |
వాయుశ్వేతసికద్రుకః |
సంవత్సరోవిఘావర్ణైః|
నిత్యా స్తే నుచరాస్తవ |
సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ॥ 5 ॥
ఓ.. శాంతి: శాంతి: శాంతిః
భావము – ఓ సహస్ర నేత్రములు కల ఇంద్రా! (మేధాతిధి కొరకు మేక రూపమును పొందిన ఓ దేవా! ప్రసన్వస కూతురును వరించు ఓ దేవా !) కాలమునకు అధినులైన దేవతలతో, ప్రకాశవంతమైన వస్త్రములను ధరించిన అగ్ని దేవునితోనూ, తెల్లటి వాయువుతోనూ, సంవత్సర దేవునితోనూ నిరంతరం సన్నిహితుగా మెలిగే దేవతలతో కూడి నాకు ప్రత్యక్షమగుదువు గాక /నన్ను అనుగ్రహింతువు గాక. ఓం ఓం ఓం. (సుబ్రహ్మణ్యోగ్ం…)
ఇతి శ్రీ సర్ప సూక్తం ||