అన్నమయ్య కీర్తన విడువ విడువనింక రాగం: సూర్యకాంతం విడువవిడువనింక విష్ణుడ నీపాదములు కడగి సంసారవార్థి కడుముంచుకొనిన ॥ పరమాత్మ నీవెందో పరాకైయున్నాను పరగ నన్నింద్రియాలు పరచినాను । ధరణిపై చెలరేగి తనువు వేసరినాను దురితాలు నలువంక~ం దొడికి తీసినను ॥ పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ వట్టి ముదిమైన రానీ వయసే రానీ । చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు ॥ యీదేహమే యయిన ఇక నొకటైనాను కాదు గూడదని ముక్తి …
