vande vaasudevam

అన్నమయ్య కీర్తన వందే వాసుదేవం వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జమ్ ॥ ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- చందనాంకిత లసత్చారు దేహమ్ । మందార మాలికామకుట సంశోభితం కందర్పజనక మరవిందనాభమ్ ॥ ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం ఖగరాజ వాహనం కమలనయనమ్ । నిగమాదిసేవితం నిజరూపశేషప- న్నగరాజ శాయినం ఘననివాసమ్ ॥ కరిపురనాథసంరక్షణే తత్పరం కరిరాజవరద సంగతకరాబ్జమ్ । సరసీరుహాననం చక్రవిభ్రాజితం తిరు వేంకటాచలాధీశం భజే ॥