teppagaa maraaku meeda

అన్నమయ్య కీర్తన తెప్పగా మర్రాకు మీద తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు । ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥ మోతనీటి మడుగులో యీతగరచినవాడు । పాతగిలే నూతిక్రింద బాయనివాడు । మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు । రోతయైన పేగుల పేరులు గలవాడు ॥ కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు । బూడిద బూసినవాని బుద్ధులవాడు । మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు । దూడల నావులగాచి దొరయైనవాడు ॥ ఆకసానబారే వూరి అతివల మానముల । కాకుసేయువాడు తురగముపైవాడు । …