తారక మంత్రము రాగం: ధన్యాసి తాళం: ఆది తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥ మీరిన కాలుని దూతలపాలిటి మృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మంత్రము ॥ మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు ॥ 1 ॥ తారక మంత్రము ॥ ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న అన్ని …
