అన్నమయ్య కీర్తన రాముడు రాఘవుడు రాగం: కానడ రాముడు రాఘవుడు రవికులు డితడు । భూమిజకు పతియైన పురుష నిధానము ॥ అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున । పరగ జనించిన పర బ్రహ్మము । సురల రక్షింపగ అసురుల శిక్షింపగ । తిరమై ఉదయించిన దివ్య తేజము ॥ చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో । సంతతము నిలిచిన సాకారము । వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి । కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము …
