pahi ramaprabho

పాహి రామప్రభో రాగం: మధ్యమావతి తాళం: ఝంప పాహిరామప్రభో పాహిరామప్రభో పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ నామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీ తేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥ ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందారాకార ఆనంద రామప్రభో ॥ 3 ॥ పాహిరామప్రభో ॥ ఎందునేజూడ మీసుందరాననము కందునో కన్నులింపొంద రామప్రభో ॥ 4 ॥ పాహిరామప్రభో ॥ పుణ్యచారిత్రలావణ్య …