అన్నమయ్య కీర్తన నల్లని మేని నల్లని మేని నగవు చూపుల వాడు । తెల్లని కన్నుల దేవుడు ॥ బిరుసైన దనుజుల పింఛమణచినట్టి । తిరుపు కైదువ తోడి దేవుడు । సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి । తెరవు చూపినట్టి దేవుడు ॥ నీటగలసినట్టి నిండిన చదువులు । తేట పరచినట్టి దేవుడు । పాటిమాలినట్టి ప్రాణుల దురితపు । తీట రాసినట్టి దేవుడు ॥ గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న । తిరువేంకటాద్రిపై దేవుడు …
