nagavulu nijamini

అన్నమయ్య కీర్తన నగవులు నిజమని నగవులు నిజమని నమ్మేదా । వొగినడియాసలు వొద్దనవే ॥ తొల్లిటి కర్మము దొంతల నుండగ । చెల్లబోయిక జేసేదా । యెల్ల లోకములు యేలేటి దేవుడ । వొల్ల నొల్లనిక నొద్దనవే ॥ పోయిన జన్మము పొరుగులనుండగ । చీయనక యిందు జెలగేదా । వేయినామముల వెన్నుడమాయలు । ఓ యయ్య యింక నొద్దనవే ॥ నలి నీనామము నాలికనుండగ । తలకొని యితరము దడవేదా । బలు శ్రీ వేంకటపతి …