అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి రాగం: ఆభోగి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 గ2 మ1 ద2 స అవ: స ద2 మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా ॥ (2.5) చరణం 1 జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి । (3.5) పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన ॥ (2.5) మనుజుడై పుట్టి మనుజుని సేవించి …
