అన్నమయ్య కీర్తన మహినుద్యోగి కావలె మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు । సహజి వలె నుండి ఏమి సాధించలెడు ॥ వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు । చెదరి మరచితే సృష్టి చీకటౌ । పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు । నిదురించితే కాలము నిమిషమై తోచు ॥ వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ । జాడతో నూరకుండితే జడుడౌను । వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ । కూడక సోమరి ఐతే గుణహీనుడౌను ॥ మురహరు …
