అన్నమయ్య కీర్తన క్షీరాబ్ధి కన్యకకు క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనమ్ ॥ జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనమ్ । అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనమ్ ॥ చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనమ్ । అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనమ్ ॥ పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనమ్ । జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనమ్ ॥
