kolani dopariki

అన్నమయ్య కీర్తన కొలని దోపరికి కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు । కుల స్వామికిని గొబ్బిళ్ళో ॥ కొండ గొడుగుగా గోవుల గాచిన । కొండొక శిశువునకు గొబ్బిళ్ళో । దండగంపు దైత్యుల కెల్లను తల । గుండు గండనికి గొబ్బిళ్ళో ॥ పాప విధుల శిశుపాలుని తిట్టుల । కోపగానికిని గొబ్బిళ్ళో । యేపున కంసుని యిడుమల బెట్టిన । గోప బాలునికి గొబ్బిళ్ళో ॥ దండివైరులను తరిమిన దనుజుల । గుండె దిగులునకు గొబ్బిళ్ళో …