అన్నమయ్య కీర్తన జయ జయ రామా జయ జయ రామా సమరవిజయ రామా । భయహర నిజభక్తపారీణ రామా ॥ జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా । అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా ॥ అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా । ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా ॥ అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా । వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా ॥
