hari naamamu kadu

అన్నమయ్య కీర్తన హరి నామము కడు హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా ॥ నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము । ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో మనసా ॥ నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము । సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో పొగడవో పొగడవో మనసా ॥ కడగి శ్రీవేంకటపతి నామము ఒడి ఒడినే సంపత్కరము । అడియాలం బిల నతి సుఖమూలము తడవవో తడవవో తడవవో మనసా ॥